Donald Trump: బైడెన్ నిర్ణయంపై ట్రంప్ అభ్యంతరం
ABN , Publish Date - Dec 17 , 2024 | 09:56 AM
నవంబర్ 5వ తేదీన అమెరికా దేశాధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నకు ఆ దేశ ప్రజలు పట్టం కట్టారు. దీంతో జనవరి 20వ తేదీన యూఎస్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాంటి వేళ.. ప్రస్తుత అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్.. రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్ కు సహయం చేయడంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.
వాషింగ్టన్, డిసెంబర్ 17: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై.. మరో కొద్ది రోజుల్లో ఆ పదవి చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ కు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సాయం చేయడం తెలివి తక్కువ పని అని ఆయన అభివర్ణించారు. అయితే అధ్యక్షుడు బైడెన్ ఈ నిర్ణయం తీసుకునే ముందు తమని సంప్రదించ లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని తెలిపారు. తాను దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే మందుకు ఈ తరహా నిర్ణయం సరైనది కాదని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతోన్న యుద్దానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాల అధినేతలతో మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఫ్లోరిడా పామ్ బిచ్‍లోని మార్ ఏ లాగో క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర
2022లో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. నాటి నుంచి ఉక్రెయిన్ కు బిలియన్ డాలర్లను జో బైడెన్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తరచూ జో బైడెన్ ప్రభుత్వాన్ని ట్రంప్ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఉక్రెయిన్ పై దాడిని ఆదేశించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ప్రశంసిస్తూ మాట్లాడిన విషయం విధితమే. ఇక ఇటీవల అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దాన్ని ఒక్క రోజులోనే ముగిస్తానని వెల్లడించారు. అయితే రష్యా స్వాధీనం చేసుకొన్న భూమిని వదులుకోవాలని ఉక్రెయిన్ పై యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశముందని ఓ ప్రచారం సైతం సాగుతోంది.
ఈ మారణ హోమాన్ని ఆపాలని రష్యా, ఉక్రెయిన్ అధినేతలతో తనతోపాటు తన ప్రతినిధులు సైతం మాట్లాడతారంటూ ఇటీవల ఓ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని పేరు ప్రస్తావిస్తూ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. యుద్ధం కారణంగా.. నగరాల్లో భవనాలు శిథిలావస్థకు చేరాయని పేర్కొన్నారు.
నవంబర్ 5వ తేదీన అమెరికా దేశాధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నకు ఆ దేశ ప్రజలు పట్టం కట్టారు. దీంతో జనవరి 20వ తేదీన యూఎస్ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాంటి వేళ.. ప్రస్తుత అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్.. రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్ కు సహయం చేయడంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.
For International News And Telugu News