Share News

1945 దాటి ముందుకు కదలని భద్రతామండలి!

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:46 AM

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలు చాలా మందకొడిగా సాగుతుండటంపై భారతదేశం అసంతృప్తి వ్యక్తం చేసింది.

1945 దాటి ముందుకు కదలని భద్రతామండలి!

  • ఐరాసలో భారత ప్రతినిధి హరీశ్‌ విమర్శ

న్యూయార్క్‌, నవంబరు 20: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలు చాలా మందకొడిగా సాగుతుండటంపై భారతదేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలం చెల్లిన నిర్మాణంతో అది ఆధునిక ప్రపంచ వాస్తవాలను ఏ మాత్రం ప్రతిబింభించట్లేదని విమర్శించింది. ‘అంతర్జాతీయ కీలక సవాళ్లు: భారతదేశ మార్గం’ అనే అంశంపై కొలంబియా వర్సిటీకి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌లో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్‌ ప్రసంగించారు. ‘భద్రతామండలిలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థ 1945 సంవత్సరం నాటి దశను ప్రతిబింభిస్తోంది’ అన్నారు. ‘ఇప్పటికే శాశ్వత సభ్యులుగా ఉన్న దేశాలు, ఆ సభ్యత్వాన్ని, వీటో అధికారాన్ని కూడా వదులుకునేందుకు అవి సిద్ధంగా లేవు’ అన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 04:48 AM