Share News

Pak consulate attack: పాక్‌కు షాక్.. జర్మనీలో కాన్సులేట్‌పై దాడి, జెండాకు నిప్పు

ABN , Publish Date - Jul 21 , 2024 | 08:43 PM

పాకిస్థాన్‌‌ షాక్‌‌కు గురి చేసిన ఘటన జర్మనీలో చోటుచేసుసుకుంది. జర్మనీలోని పాక్ కాన్సులేట్‌పై ఆప్ఘన్ పౌరులు దాడికి దిగారు. రాళ్లు విసురుతూ, పాకిస్థాన్ జెండాను తొలగించారు. జాతీయ జెండాకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు.

Pak consulate attack: పాక్‌కు షాక్.. జర్మనీలో కాన్సులేట్‌పై దాడి, జెండాకు నిప్పు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌‌ (Pakistan)ను షాక్‌‌కు గురి చేసిన ఘటన జర్మనీ (Germany)లో చోటుచేసుసుకుంది. జర్మనీలోని పాక్ కాన్సులేట్‌పై ఆప్ఘన్ పౌరులు (Afghan citizens) దాడికి (Attack) దిగారు. రాళ్లు విసురుతూ, పాకిస్థాన్ జెండాను తొలగించారు. జాతీయ జెండాకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


మీడియా కథనాల ప్రకారం, ఆప్ఘన్ పౌరులు శనివారంనాడు ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆందోళన కారులు పాక్ కాన్సులైట్‌పై రాళ్లు రువ్వుతూ, పాక్ జెండాను తొలగించారు. జెండాకు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. సుమారు 8 నుంచి 10 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ్నించి పరారయ్యారు. ఈ ఘటనలో ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.

Crime News: మహిళలపై ద్వేషంతో ముక్కలుగా కోసి 42 హత్యలు.. కెన్యాలో సైకో కిల్లర్


జర్మన్ అధికారుల వైఫల్యంపై పాక్ కస్సుబుస్సు

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ సిటీలో ఉన్న తమ కాన్సులేట్‌పై దాడి ఘటనను పాక్ ఆదివారంనాడు ఖండించింది. దౌత్య కార్యాలయాల రక్షణలో జర్మన్ అధికారుల వైఫల్యాన్ని తప్పుపట్టింది. తమ కౌన్సులేట్ సిబ్బంది ప్రాణాలకు ముప్పు తలెత్తిందని పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి పాల్పడిన వారి జాతీయతను మాత్రం వెల్లడించలేదు. 1963 కాన్సులర్ రిలేషన్స్‌పై వియన్నా ఒప్పంద ప్రకారం, కాన్సులర్ కార్యాలయ పవిత్రతను కాపాడటం, దౌత్యవేత్తల రక్షణ బాధ్యత హోస్ట్ గవర్నమెంట్‌‌కు ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, భద్రతా వైఫల్యానికి కారకులైన వారిని గుర్తించాలని జర్మన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది.


ఇదే మొదటిసారి కాదు..

ఆప్ఘన్ జాతీయులు పాక్ పట్ల శత్రుత్వంతో వ్యవహరించడం ఇదే మొదటి సారి కాదు. 2019లో షార్జాలో జరిగిన ఆసియా కప్‌లో ఆప్ఘనిస్థాన్‌పై పాక్ విజయం సాధించినప్పుడు, రెండు పక్షాల మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వికెట్ తేడాతో ఆప్ఘన్ జట్టు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని మద్దతుదారులు భావోద్వేగానికి గురై పాక్ అభిమానులపై కలబడ్డారు. స్టేడియంను డ్యామేజ్ చేశారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 09:31 PM