Share News

PM Modi: త్వరలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకంటే

ABN , Publish Date - Oct 18 , 2024 | 07:12 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సు కోసం త్వరలో ఆ దేశానికి వెళ్తున్నారు. అక్టోబరు 22న అక్కడికి వెళ్లనున్న ఆయన రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు.

PM Modi: త్వరలో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకంటే

ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సు కోసం త్వరలో ఆ దేశానికి వెళ్తున్నారు. అక్టోబరు 22న అక్కడికి వెళ్లనున్న ఆయన రెండు రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. పుతిన్.. అక్టోబర్ 22న కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు మోదీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మోదీని తన మిత్రుడిగా అభివర్ణించారు. తాజా పర్యటనతో ఈ ఏడాది ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి అవుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత రష్యా రాజధాని మాస్కోలో ఆయన తొలిపర్యటన ఇది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ ని మోదీ కోరారు. ప్రధాని మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన కొన్నాళ్లకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలిశారు. ప్రధాని అయ్యాక మోదీ ఇప్పటి వరకు ఆరుసార్లు రష్యాలో పర్యటించారు. ఈ ఏడాది బ్రిక్స్‌ సమావేశాలకు రష్యా అధ్యక్షత వహిస్తోంది.


బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొంటున్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్తగా చేరాయి. ఈ ఏడాది జులై 8న ప్రధాని మోదీ రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించారు. ఆ సమయంలో రష్యా అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌తో నరేంద్ర మోదీని అక్కడి ప్రభుత్వం సత్కరించింది. అవార్డు ప్రదానం చేసినందుకుగానూ పుతిన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల గౌరవమని అన్నారు. ఈ పర్యటన భారత్, రష్యాల మధ్య నూతన స్నేహ బంధం చిగురించేలా చేసింది.
Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 07:12 PM