Share News

Flight Makes Emergency Landing: విమానంలో ఎలుక... అత్యవసరంగా ల్యాండింగ్..

ABN , Publish Date - Sep 22 , 2024 | 06:07 PM

విమానానికి బాంబు బెదిరింపు. విమానంలో ప్రయాణికుడికి అనారోగ్యం. విమానాన్ని పక్షి ఢీకొట్టింది. తదితర కారణాలతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చిన్న ఎలుక. ఒకే ఒక్క చిట్టి ఎలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

Flight Makes Emergency Landing: విమానంలో ఎలుక... అత్యవసరంగా ల్యాండింగ్..

విమానానికి బాంబు బెదిరింపు. విమానంలో ప్రయాణికుడికి అనారోగ్యం. విమానాన్ని పక్షి ఢీకొట్టింది. తదితర కారణాలతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చిన్న ఎలుక. ఒకే ఒక్క చిట్టి ఎలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మాలాగాకు ప్రయాణికులతో స్కాండినేవియన్ సంస్థకు చెందిన ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరింది.

Also Read: Viral Video: భారత్‌లో సరే.. చైనాలో జనరల్ రైలు బోగీలో ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?


ప్రయాణికులకు విమాన సిబ్బంది.. భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. ఓ ప్రయాణికురాలు.. తన భోజనం ప్యాకెట్ విప్పింది. ప్యాకెట్‌లో నుంచి ఓ చిట్టి ఎలుక బయటకు దూకింది. కళ్లు తెరిచి మూసేలోగా.. ఆ చిట్టెలుక మాయమైంది. అంతే విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది సైతం నానా హైరానా పడిపోయారు. ఈ చిట్టెలుక.. విమానంలోని వైర్లను కానీ ఓ వేళ కొరికితే.. తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం ఖాయమంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఓస్లో ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులకు జరిగిన ఘటనను వివరించారు. వారి ఆదేశాల మేరకు కోపెన్‌హాగన్‌కు మళ్లించి.... అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమానాన్ని ల్యాండ్ చేశారు.

Also Read: Rail Track: రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం


అనంతరం ఈ విమానంలోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపినట్లు స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. అలాగే ప్రయాణికులతో పాటు సిబ్బంది భద్రత తమకు అత్యంత ముఖ్యమని ఆ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. అదే విధంగా ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని వివరించారు. కోపెన్‌హాగన్‌లో నిలిపి ఉన్న విమానంలో ఎలుక కోసం ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తరహా ఘటనలు చాలా అరుదుగా జరుతాయన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఆహారం సరఫరా చేసిన సంస్థను సైతం విచారిస్తామని తెలిపారు.

Also Read: YS Jagan: పీఎస్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు

For More International News And Telugu News..

Updated Date - Sep 22 , 2024 | 07:11 PM