Share News

Watch Video: కిమ్ జోంగ్ కోసం డ్రైవర్‌గా మారిన పుతిన్.. నెట్టింట్లో వీడియో వైరల్

ABN , Publish Date - Jun 21 , 2024 | 01:42 PM

రష్యా, ఉత్తర కొరియా దేశాధ్యక్షులైన వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. తమ చర్యలకు, తీసుకునే ప్రతి నిర్ణయానికి

Watch Video: కిమ్ జోంగ్ కోసం డ్రైవర్‌గా మారిన పుతిన్.. నెట్టింట్లో వీడియో వైరల్
Vladimir Putin

రష్యా, ఉత్తర కొరియా దేశాధ్యక్షులైన వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin), కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసు. తమ చర్యలకు, తీసుకునే ప్రతి నిర్ణయానికి పరస్పర మద్దతులు తెలుపుకోవడమే కాదు.. అవసరానికి అనుగుణంగా ఆయుధాలనూ పంచుకుంటారు. వీళ్లిద్దరు కలిసిన ప్రతిసారి దేశాధ్యక్షుల్లా కాకుండా మంచి స్నేహితులుగా మెలుగుతుంటారు. లేటెస్ట్‌గా పుతిన్ కిమ్ కోసం ఏకంగా డ్రైవర్ అవతారం ఎత్తాడంటే.. వీరి మధ్య బంధం ఎంతటి బలమైందో మీరే అర్థం చేసుకోండి.


అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ రాజకీయ నేతల్లో ఒకరైన పుతిన్.. కిమ్ కోసం కొద్దిసేపటి వరకూ డ్రైవర్‌గా మారారు. రష్యాలో రూపొందిన ‘ఆరస్ లిమోసిన్’ అనే కొత్త కారులో కిమ్‌ని కూర్చోబెట్టుకొని.. రయ్‌రయ్‌మంటూ పుతిన్ దూసుకెళ్లారు. ఈ రైడ్ సమయంలో ఇద్దరు అధ్యక్షులు సరదా సంభాషణ కూడా కొనసాగించారు. అనంతరం ఒక చోట దిగి.. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అధికారిక భవనంలోని వెళ్లిపోయారు. పుతిన్ డ్రైవ్ చేస్తున్న వీడియోను రష్యన్ స్టేట్ టీవీ విడుదల చేయగా.. అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోవైపు.. ఈ ఆరస్ కారుని కిమ్‌కి పుతిన్ బహూకరించారని తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే మోడల్ కారుని కిమ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారు.


ఇదిలావుండగా.. ఓవైపు ఉక్రెయిన్‌-రష్యా మధ్య రెండేళ్ల నుంచి తీవ్ర యుద్ధం జరుగుతుండగా, మరోవైపు దక్షిణ కొరియా-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కొరియా దేశాలు ఎప్పుడైనా తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఇరు దేశాధ్యక్షులు సైనిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒకవేళ దాడులు జరిగితే.. పరస్పర రక్షణలో భాగంగా సైనిక సహకారం అందిపుచ్చుకునేలా డీల్ చేసుకున్నారు. ఈ కొత్త సంబంధానికి కిమ్ జోంగ్ ఉన్ అప్పట్లో ‘కూటమి’ (Alliance) అనే నామకరణం కూడా చేశారు. దక్షిణ కొరియాకు అమెరికా దగ్గరవుతుండటం వల్లే.. కిమ్ ఇలా రష్యాతో తన బంధాల్ని బలోపేతం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 01:42 PM