Share News

Uttar Pradesh: 80 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

ABN , Publish Date - Aug 06 , 2024 | 08:32 AM

ఉత్తరప్రదేశ్‌ డియోరియా జిల్లాలో మోహరూనా గ్రామంలోని పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ఆశ్రమ్ మెథడ్ కాలేజీలోని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కడుపు నొప్పి, వాంతులు, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో వారు బాధపడుతున్నారు. దీంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన.. చికిత్స అందించినట్లు కాలేజీ అధికారులు వెల్లడించారు.

Uttar Pradesh: 80 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

లఖ్‌నవూ, ఆగస్ట్ 06: ఉత్తరప్రదేశ్‌ డియోరియా జిల్లాలో మోహరూనా గ్రామంలోని పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ ఆశ్రమ్ మెథడ్ కాలేజీలోని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కడుపు నొప్పి, వాంతులు, ఇతరత్ర అనారోగ్య సమస్యలతో వారు బాధపడుతున్నారు. దీంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన.. చికిత్స అందించినట్లు కాలేజీ అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మాత్రం సంక్లిష్టంగా మారిందని తెలిపారు.

Also Read: Gold Rates Today: తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర.. ఎంతంటే?


దాంతో వారిని మహర్షి దేవర్హ బాబా మెడికల్ కాలేజీకి తరలించినట్లు చెప్పారు. మిగిలిన విద్యార్థులంతా కోలుకున్నారన్నారు. ఈ ఘటనపై సమాచారం తెలియడంతో.. జిల్లా కలెక్టర్ దివ్య మిట్టల్‌తోపాటు ఎస్పీ ఆశ్రమ కాలేజీకి చేరుకుని విద్యార్థులను సందర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివ్య మాట్లాడుతూ.. కాలేజీలోని విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. అలాగే కాలేజీలోని వంటశాలలో ఆహార పదార్థాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. నివేదిక వచ్చిన వెంటనే.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆశ్రమ కాలేజీలోని వంటశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ క్రమంలో ఆ యా ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో కాలేజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులోభాగంగా కాలేజీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఆశ్రమ పాఠశాల నడుస్తుంది.


ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ ఆశ్రమ కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీలో ప్రస్తుతం 326 మంది విద్యార్థులు ఉన్నారు. ఆదివారం రాత్రి తీసుకున్న ఆహారం అనంతరం విద్యార్థులంతా బాగానే ఉన్నారని కాలేజీ అధికారులు తెలిపారు. అయితే ఆర్థరాత్రి నుంచి కొంత మంది అనారోగ్యానికి గురి కాగా.. సోమవారం ఉదయానికి ఆ సంఖ్య 80కి చేరిందని కాలేజీ అధికారులు వివరించారు. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 06 , 2024 | 08:32 AM