Delhi Liquor Case:బీజేపీ నెక్ట్స్ టార్గెట్ అదే.. జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Apr 04 , 2024 | 10:19 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాక బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి బయటకు రాగానే అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియాలను ఆయన కలిశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాక బీజేపీ(BJP)పై తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి బయటకు రాగానే అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియాలను ఆయన కలిశారు. ఆ తర్వత తన ఇంటికి వెళ్లిన సంజయ్‌సింగ్‌కు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంజయ్ సింగ్ ఇంటికి తరలివచ్చారు.
Uttar Pradesh: యూపీలో బీజేపీ కూటమి హవా.. తేలిపోనున్న ఎస్పీ: ఇండియా టీవీ సర్వే
సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు పలు షరతులు విధించింది. కేసు దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలని, తన చిరునామా, ఫోన్ నెంబర్ తదితర వివరాలు కేసు విచారణ అధికారికి ఇవ్వాలని కోర్టు సూచించింది. దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించాలని న్యాయమూర్తి సూచించిన విషయం తెలిసిందే. బెయిల్‌పై విడుదల తర్వాత సంజయ్ సింగ్ బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. సామాన్యులు ఎవరికీ భయపడరని అన్నారు. ఇది సంబరాల సమయం కాదని, యుద్ధానికి సమయంగా సంజయ్ సింగ్ పేర్కొన్నారు.
బీజేపీ టార్గెట్‌గా..
ఆప్ ఉద్యమం నుంచి ఉద్భవించిన పార్టీ అని, ఎవరి బెదిరింపులకు భయపడబోమని సంజయ్ సింగ్ చెప్పారు. మా పార్టీని విచ్ఛిన్నం చేయానే కుట్రకు బీజేపీ తెరలేపిందన్నారు. ఢిల్లీ ప్రజల కోసం పని చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను జైల్లో పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్, రాఘవ్ చద్దాలను అరెస్ట్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారని ఆరోపించారు. బీజేపీ నియంతృత్వ పాలనకు ప్రజలు స్వస్తి పలకాలన్నారు. నియంతృత్వ పాలనను కూలదోస్తామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Congress: సీటు పోటు.. సంజయ్ నిరుపమ్‌పై సస్పెన్షన్ వేటు..?