Share News

Business Class: ప్రయాణికుడికి చుక్కలు చూపించిన‘ఎయిర్ ఇండియా’

ABN , Publish Date - Jun 16 , 2024 | 06:28 PM

బస్సు ప్రయాణం, రైలు ప్రయాణమన్న తర్వాత ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ, ఎవరో ఒక్కరికి అసౌకర్యం కలుగుతుంటుంది. రూ.10లు, రూ. 100లు చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తారు. కాబట్టి ఆ యా ప్రయాణికులు సర్థుకు పోతుంటారు.

Business Class: ప్రయాణికుడికి చుక్కలు చూపించిన‘ఎయిర్ ఇండియా’

బస్సు ప్రయాణం, రైలు ప్రయాణమన్న తర్వాత ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ, ఎవరో ఒక్కరికి అసౌకర్యం కలుగుతుంటుంది. రూ.10లు, రూ. 100లు చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తారు. కాబట్టి ఆ యా ప్రయాణికులు సర్థుకు పోతుంటారు. కానీ అదే రూ.5 లక్షలు పెట్టి టికెట్ కొనుగోలు చేసి విమాన ప్రయాణం.. అదీకూడా బిజినెస్ క్లాస్‌ విమానంలో యాణికుడికి‘పదనిసలు’తప్పలేదంటే.. అతడు ఎంత వేదనకు గురై ఉంటాడు. ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ విమానంలో తన ప్రయాణంలో కలిగిన చేదు అనుభవాన్ని బాధితుడు వినీత్ కే. తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నాడు.

Also Read: Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్


తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే.. 25 నిమిషాల ఆలస్యంగా విమానం టేక్ ఆఫ్ అయింది. ఇక విమానంలో సీట్ శుభ్రంగా లేదు.. బాగా మాసి పోయి ఉంది. అలాగే సీట్లకు ఉండే కవర్లు సైతం అపరిశుభ్రంగా ఉన్నాయి. నిద్రకు ఉపక్రమించే క్రమంలో సీటు వెనక్కి నెట్టితే వెళ్ల లేదు. ఇక విమాన సిబ్బంది తనకు సరఫరా చేసిన ఆహారం సైతం చెత్తగా ఉంది. మరోవైపు విమానంలో టీవీ సైతం పని చేయకపోవడం మరో విశేషం. తన లగేజీకి ఉన్న ట్యాగ్ ఊడిపోయింది. అంతేకాదు తన సూట్ కేసు హ్యాండిల్ సైతం పగిలిపోయింది, లగేజీ జిప్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో సదరు విమాన ప్రయాణంలో తనకు కలిగిన కష్టాలకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా వివేక్ కే పంచుకున్నాడు.

Also Read: Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి


అయితే తాను తరచు న్యూయార్క్, లండన్, షికాగో ప్రయాణిస్తూ ఉంటానన్నారు. ఆ క్రమంలో ఎమిరెట్ సంస్థకు చెందిన విమానాల్లో ఎక్కువగా ప్రయాణం సాగిస్తూ ఉంటానని గుర్తు చేసుకున్నారు. అయితే తాజాగా ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌ విమానంలో ప్రయాణం చేయాలనుకున్నానని తెలిపారు.

Also Read: Amit Shah:జమ్ము కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై సమీక్ష


అదీకూడా న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు నేరుగా ఈ సర్వీస్ ఉండడంతో.. ఈ ఎయిర్ ఇండియా సర్వీస్‌ను ఎంచుకున్నట్లు చెప్పారు. ఇక నిన్న ఈ విమాన ప్రయాణం తనకో పీడకల అని వివేక్ కే. అభివర్ణించారు. ఇక వివేక్ కే. ఎక్స్ వేదికగా స్పందించిన ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ ఎక్స్ వేదికగా స్పందించింది. ఆ కొద్ది సేపటికే దానిని ఆ సంస్థ తన ఖాతా నుంచి తొలగించింది. మరోవైపు వివేక్ కే తన విమాన ప్రయాణంలో కలిగిన కష్టాలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లే క్రమంలో ఎయిర్ ఇండియా విమానంలో ఇదే తరహా అనుభవం గతంలో తనకు ఎదురైందని కామెంట్ చేశాడు.

Also Read: Suresh Gopi :‘మదర్ ఇండియా’ వ్యాఖ్యలపై వివరణ

Read Latest National News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 07:10 PM