Amit Shah: రాజకీయాల్ని దిగజారుస్తున్నారంటూ.. నకిలీ వీడియోపై తీవ్రంగా మండిపడ్డ అమిత్ షా
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:06 PM
రిజర్వేషన్లను తొలగిస్తామని తాను చెప్పినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ‘డీప్‌ఫేక్’ వీడియోపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఫేక్ వీడియోను షేర్ చేయడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హస్తం..
రిజర్వేషన్లను తొలగిస్తామని తాను చెప్పినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ‘డీప్‌ఫేక్’ వీడియోపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్రంగా స్పందించారు. ఈ ఫేక్ వీడియోను షేర్ చేయడం వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హస్తం ఉందని ఆరోపించారు. అధికారం కోసం నిరాశలో ఉన్న రాహుల్.. తన ఫేక్ వీడియోని షేక్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి చర్యలతో రాహుల్ రాజకీయాలను దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు.
రాహుల్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, ఇలా ఎప్పుడూ ఫేక్ వీడియో ప్రచారాలు జరగలేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగా రాహుల్ ఎన్నికల్లో పోటీ చేయాలని.. ఇలా ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేసి కాదని ఎద్దేవా చేశారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. తన ఒరిజినల్ వీడియోతో పాటు డీప్‌ఫేక్ వీడియోలను సైతం ప్లే చేశారు. మత ప్రాతిపదికన కోటా ఇవ్వడం అన్యాయమని, ఇది ఏమాత్రం అనుమతించబడదని తేల్చి చెప్పారు. తాము ఇప్పటికే కర్ణాటకలో దానిని తొలగించామని, ఇదే ఆ వీడియోలో తాను చెప్పానని స్పష్టం చేశారు.
‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’
బీజేపీ అన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెప్పినట్లు నకిలీ వీడియోని సృష్టించారన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను తమ బీజేపీ తొలగించదని.. అలాగే ఎవరినీ అనుమతించదని.. ఇది మోదీ గ్యారెంటీ అని నొక్కి చెప్పారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్‌ను తొలగిస్తుందని రాహుల్ అసత్య ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తమకు రెండు దఫాలుగా పూర్తిగా మెజారిటీ దక్కిందని, అయితే మోదీ రిజర్వేషన్‌ని మద్దతుదారు అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లను బీజేపీ తొలగించదని అమిత్ షా మరోసారి పునరుద్ఘాటించారు.
వరుడిని ఇరకాటంలో పడేసిన ‘మోదీ’ పేరు.. ఎందుకో తెలుసా?
కాగా.. ఈ డీప్‌ఫేక్ వీడియో కేసులో పోలీసులు అసోంలోని గౌహతికి చెందిన రీతం సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనొక కాంగ్రెస్ కార్యకర్త అని విచారణలో తేలింది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ కోటాపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి.. ఆ వీప్‌ఫేక్ వీడియోని అతను రూపొందించాడని, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడని తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
Read Latest National News and Telugu News
తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి