AAP: 'ఆప్'కు షాక్... మహిళా సమ్మాన్ యోజన రిజిస్ట్రేషన్లపై ఎల్జీ కొరడా
ABN , Publish Date - Dec 28 , 2024 | 03:56 PM
'మహిళా సమ్మాన్ యోజన' పేరుతో రిజిస్ట్రేషన్లు చేస్తున్న వ్యక్తులపై లీగల్ చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారంనాడు ఆదేశించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందస్తు పథకాల ప్రకటన, రిజిస్ట్రేషన్లతో దూసుకు వెళ్తు్న్న ఆప్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి దెబ్బ తగిలింది. 'మహిళా సమ్మాన్ యోజన' పేరుతో రిజిస్ట్రేషన్లు చేస్తున్న వ్యక్తులపై లీగల్ చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (VK Saxena) శనివారంనాడు ఆదేశించారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీస్ కమిషనర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ ఈ తాజా ఆదేశాలు ఇచ్చారు. క్యాంపులు పెట్టి మరీ పథకాల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎల్జీ ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. మహిళా సమ్మాన్ స్కీమ్ పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మహిళలను తప్పదారి పట్టిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నట్టు సందీప్ దీక్షిత్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు గత గురువారంనాడు ఫిర్యాదు చేశారు.
Manmohan Singh: మన్మోహన్ ముగ్గురు కుమార్తెలు ప్రముఖులే
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళా సమ్మాజన్ యోజన నడుస్తోందని చెబుతుండటం అసలు విషయం కాదనీ, ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని రూ.2,100కు పెంచుతామని కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించారని దీక్షిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా సమ్మాన్ యోజన్‌ను ప్రభుత్వం నోటిఫై చేయలేదని, అలాంటి స్కీమ్ ఏదీ లేదని ఢిల్లీ మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఇటీవల పేర్కొన్న విషయాన్ని దీక్షిత ఎల్జీ దృష్టికి తెచ్చారు. దీంతో ఆప్ 'ఫ్రాడ్'కు పాల్పడుతోందనే విషయం స్పష్టమవుతోందని, వాళ్లు ఇంటింటికి వెళ్లి మహిళల సంతకాలు కూడా తీసుకుంటున్నారని తన ఫిర్యాదులో దీక్షిత్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని ఎల్జీని ఆయన కోరారు.
ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ డిసెంబర్ 22న 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన', 'సంజీవని యోజన' పథకాల రిజిస్ట్రేషన్‌ను ప్రకటించారు. ప్రజలు ఎక్కడకూ వెళ్లనక్కర లేదని, తమ టీమ్‌లే ఇంటింటికి వెళ్లి మహిళల రిజిస్ట్రేషన్‌కు సహకరించి, కార్డులు ఇస్తాయని చెప్పారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ఢిల్లీలోని మహిళలకు నెలవారీ రూ.2,100 ఆర్థిక సాయం అందించేందుకు 'మహిళా సమ్మాన్ యోజన' పథకం ఉద్దేశించగా, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటజన్లకు ఉచిత వైద్య చికిత్స అందించేందుకు 'సంజీవని యోజన' ఉద్దేశించారు.
ఇవి కూడా చదవండి..
National: ఢిల్లీలో అంత్యక్రియలు జరగని మాజీ ప్రధానులు ఎవరో మీకు తెలుసా.. వీరిలో తెలుగు వ్యక్తి కూడా..
Manmohan Singh Funeral: మన్మోహన్ సింగ్ అంతిమ యాత్రలో రాహుల్ గాంధీ ఏం చేశారంటే
Read More National News and Latest Telugu News