Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం | Central Government on took Another important decision to End Naxalism in Chhattisgarh
Share News

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:16 AM

ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Chhattisgarh : నక్సల్స్‌పై ఆఖరి పోరాటం

  • సన్నాహాలు ముమ్మరం చేసిన కేంద్రం

  • ఛత్తీస్‌గఢ్‌కు అదనంగా 4 వేల బలగాలు

  • 4 సీఆర్పీఎఫ్‌ బెటాలియన్ల తరలింపు

  • ఆపరేషన్‌ ప్రహర్‌లో పుంజుకోనున్న వేగం

(సెంట్రల్‌ డెస్క్‌)

ఛత్తీ్‌స్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఝార్ఖండ్‌లోని మూడు బెటాలియన్లు, బిహార్‌లోని ఒక పటాలానికి చెందిన సీఆర్పీఎఫ్‌ బలగాలను ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ రీజియన్‌కు తరలించాలని నిర్ణయించింది.

ఈ నాలుగు బెటాలియన్లకు చెందిన సుమారు 4 వేల మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు.. ఇప్పటికే 40కి పైగా ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌(ఎ్‌ఫవోబీ)లను ఏర్పాటు చేసుకుని, యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్లలో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్పీఎ్‌ఫ-కోబ్రా బలగాలతో కలిసి.. ‘ఆపరేషన్‌ ప్రహార్‌’లో పాల్గొంటారని ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టులకు కంచుకోటగా బస్తర్‌ రీజియన్‌లోని పది జిల్లాలు ఉండేవి.

గడిచిన నాలుగేళ్లలో ఆ సంఖ్య ఏడు జిల్లాలకు పరిమితమైంది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 153 మంది నక్సల్స్‌ అంతమొందగా.. మావోయిస్టులకు కంచుకోటగా పేరున్న అబుజ్‌మడ్‌ అడవుల్లోనికి కూడా బలగాలు చొచ్చుకువెళ్లాయి. ఇటీవల కాంకేర్‌ జిల్లా పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో.. అబుజ్‌మడ్‌ ప్రవేశ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో 17 మంది నక్సల్స్‌ మృతిచెందారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

  • కొత్త బలగాలతో మరింత బలం

ఇప్పటికే ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో సీఆర్పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, జిల్లాల స్థాయుల్లో డీఆర్జీ, ఏఆర్‌ బలగాలు.. ఇలా 60 వేలకు పైగా జవాన్లు, కానిస్టేబుళ్లు నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. కొత్తగా వస్తున్న 4 వేల మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు కూడా యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్లలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ‘‘కొత్తగా వచ్చే 4 వేల బలగాలతోపాటు.. డాగ్‌ స్క్వాడ్స్‌, డ్రోన్లు(యూఏవీలు), అధునాతన కమ్యూనికేషన్‌ సెట్లు ఉంటాయి. 2026 టార్గెట్‌ నేపథ్యంలో.. వీలైనంత త్వరగా దట్టమైన అడవుల్లోనూ హెలిప్యాడ్లు, రోడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి’’ అని అధికార వర్గాలు తెలిపాయి. అయితే.. 2005లో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ ప్రారంభమైనప్పటి నుంచి తాజా ఆపరేషన్‌ ప్రహర్‌ వరకు బలగాల వైపు కూడా భారీగానే ప్రాణనష్టం ఉందని, హెలిప్యాడ్లు, రోడ్ల ఏర్పాటుతో ఇప్పుడు ఆ నష్టాన్ని నివారించవచ్చని విశ్రాంత సీఆర్పీఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఛత్తీ్‌సగఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలగాలు మాత్రం వీటినేమి లెక్కచేయకుండా అడవుల్లో ముందుకు సాగుతున్నాయి. వర్షాకాలంలో నక్సల్స్‌ కదలికలు ఎక్కువగా ఉండవని, షెల్టర్‌ జోన్లలో తలదాచుకుంటారని, వారిని గుర్తించేందుకు ఇదే సమయమని ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు చెబుతున్నారు.


  • అబుజ్‌మడ్‌పై పట్టు సాధ్యమేనా?

ఛత్తీ్‌సగఢ్‌ బలగాలు తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్‌ సహాయం లేకుండానే.. ఇటీవల అబుజ్‌మడ్‌లో భారీ ఆపరేషన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే..! నక్సల్స్‌ కంచుకోట అయిన అబుజ్‌మడ్‌లోకి ప్రవేశించి, ఆపరేషన్‌ నిర్వహించడం ఇదే మొదటి సారి. అయితే.. నారాయణ్‌పూర్‌, బీజాపూర్‌, దంతేవాడ జిల్లాల్లో 4 వేల చదరపు కిలోమీటర్ల మేర అబుజ్‌మడ్‌ అడవులు విస్తరించాయని విశ్రాంత అధికారులు చెబుతున్నారు. ఇక తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లోని కొండపల్లి కూడా పోలీసులకు ఓ సవాలుగా ఉంది.

ఈ ప్రాంతంలో సీఆర్పీఎ్‌ఫకు చెందిన 7 క్యాంపులు ఉన్నాయి. తెలంగాణ క్యాడర్‌కు చెందిన కీలక మావోయిస్టు నేతలు కొండపల్లిలోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కొండపల్లి వెళ్లడం మాత్రం ప్రాణాలతో చెలగాటమనే అభిప్రాయాలు సీఆర్పీఎఫ్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతం చుట్టూ మావోయిస్టులు మందుపాతరలను అమర్చారని, ఎక్కడికక్కడ బాబీట్రా్‌పలను ఏర్పాటు చేశారని చెబుతున్నారు.

Untitled-1 copy.jpg

Updated Date - Sep 09 , 2024 | 03:18 AM