Share News

Chennai: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3,000 మంది పోలీసులు

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:56 AM

నగరంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3,000 మంది పోలీసులు భద్రతా పనులు చేపట్టనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు గత ఏప్రిల్‌ 19వ తేది ఒకే విడతలో నిర్వహించగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన జరుగనుంది.

Chennai: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3,000 మంది పోలీసులు

- ‘వజ్ర’, ‘వరుణ్‌’ వాహనాల మోహరింపు

చెన్నై: నగరంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు గత ఏప్రిల్‌ 19వ తేది ఒకే విడతలో నిర్వహించగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన జరుగనుంది. చెన్నై(Chennai) జిల్లా పరిధిలో మూడు లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు మూడు ప్రాంతాల్లో జరుగనుంది. దక్షిణ చెన్నై లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గిండి అన్నా విశ్వవిద్యాలయంలోను, ఉత్తర చెన్నై లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు రాణి మేరీ కళాశాల, మధ్య చెన్నై లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు లయోలా కళాశాలలో జరుగనుంది. ఈ మూడు లెక్కింపు కేంద్రాల వద్ద సుమారు 3,000 మంది పోలీసులు భద్రతా విధులు చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

ఇదికూడా చదవండి: Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం


నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌రాయ్‌ రాధోడ్‌ పర్యవేక్షణలో డిప్యూటీ కమిషనర్‌ ప్రేమ్‌ ఆనంద్‌సిన్హా, తూర్పు మండల సహాయ కమిషనర్‌ ధర్మరాజ్‌ ఈ 3వేల మందికి నేతృత్వం వహించనున్నారు. భద్రతా విధుల్లో 10 మంది డిప్యూటీ పోలీసు కమిషనర్లు, 35 మంది ఎస్‌ఐలు, 120 మంది సబ్‌ ఇన్స్‌పెక్టర్లు, సాయుధదళ పోలీసుల చొప్పున మొత్తం 3,000 మంది పాల్గొననున్నారు. ఆందోళనలు జరిగిన సమయంలో వాటిని అణిచివేసేందుకు ‘వజ్ర’, ‘వరుణ్‌’('Vajra', 'Varun') తదితర వాహనాలు కూడా సిద్ధం చేసినట్లు నగర పోలీసు శాఖ తెలియజేసింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో వజ్ర వాహనాలను మోహరింపజేయనున్నట్లు పోలీస్‌శాఖ పేర్కొంది.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 11:56 AM