CM Stalin: మా పాలన గొప్పతనం తెలుసుకోండి
ABN , Publish Date - Nov 05 , 2024 | 01:22 PM
రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీలు ప్రారంభించేవారంతా డీఎంకే నాశనాన్ని కోరుకుంటున్నారని, వారికి నాలుగేళ్ల ద్రావిడ తరహా పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు గురించి తెలియకపోవడం శోచనీయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) టీఎంకే నేత విజయ్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు.
- కొత్తగా పార్టీలు పెట్టేవారంతా డీఎంకే నాశనాన్నే కోరుకుంటున్నారు
- విజయ్‌పై సీఎం స్టాలిన్ ధ్వజం
చెన్నై: రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీలు ప్రారంభించేవారంతా డీఎంకే నాశనాన్ని కోరుకుంటున్నారని, వారికి నాలుగేళ్ల ద్రావిడ తరహా పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు గురించి తెలియకపోవడం శోచనీయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) టీఎంకే నేత విజయ్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. తన నియోజకవర్గమైన కొళత్తూరులో కొన్ని పథకాలకు ప్రారంభోత్సవం, మరికొన్ని పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా కొళత్తూరు పెరియార్‌నగర్‌లోని అనితా అచీవర్స్ అకాడమీలో ఏర్పాటైన సభలతో ఆయన ప్రసంగిస్తూ నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకుని విద్యార్థిని అనితా పేరుతో 2017లో స్థాపించిన ఈ అకాడమీలో శిక్షణ పొందనివారంతా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతుండటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: లడ్డూ కావాలా నాయనా..
నీట్ రద్దు కోసం తాము సుదీర్ఘ న్యాయపోరాటం సాగిస్తూనే ఉంటామని, ఏదో ఒక రోజు నీట్ రద్దయి తీరుతుందనే నమ్మకం తనకుందన్నారు. ప్రస్తుతం ఈ అకాడమీలో శిక్షణ పొందిన 457 మందికి లాప్‌టా్‌పలు, కుట్టుమిషన్లు అందించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. తన నియోజకవర్గంలో మొదటిసారిగా కో-వర్కింగ్ స్పేస్ ‘ముదల్వర్ పడైప్పగం’ భవనం ప్రారంభించామని, ఆ భవనంలో పోటీ పరీక్షలకు చదువునున్న విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారనున్న యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ద్రావిడ తరహా డీఎంకే పాలనలో విద్య, వైద్యానికి, మహాభ్యుదయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నాన్ ముదల్వన్, పుదుమైపెణ్, తమిళ్‌పుదల్వన్ తదితర పథకాల ద్వారా యువతీయువకులు లబ్దిపొందుతున్నారని చెప్పారు.
ఇంచుమించు నాలుగేళ్ల డీఎంకే పాలనలో ఎన్నికల సమయంలో చేసిన హామీలను తొంభై శాతానికి పైగా నెరవేర్చామని, తక్కిన హామీలు కూడా ఆచరణకు నోచుకుంటాయని స్టాలిన్ అన్నారు. డీఎంకే ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన, పొరుగు రాష్ట్రాలు కూడా మెచ్చుకునే పలు సంక్షేమపథకాలు అమలు చేస్తున్నా, అభివృద్ధి ఎక్కడా కనిపించడమే లేదంటూ కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయన్నారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగినట్లు కోటలో ప్రకటించిన పథకాలన్నీ కోటకే పరిమితమైనట్లు, తమ ప్రభుత్వం పథకాలను కాగితాలకే పరిమితం చేయడం లేదని, సంక్షేమ పథకాల ప్రకటన చేయడమే కాకుండా అవన్నీ సక్రమంగా అమలువుతున్నాయా? లేదా అని క్షేత్ర పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
ఇటీవల నగరంలో గంటసేపు వర్షం కురిసినప్పుడు వాన నిలిచిన కొన్ని గంటల్లోనే రోడ్లపై ప్రవహించిన నీరంతా కనిపించకుండా పోయిందని, ముందస్తు జాగ్రత్తలు చేపట్టడం వల్ల ఇది సాధ్యమైందని, వర్ష సూచన వెలువడగానే తానో వైపు, ఉప ముఖ్యమంత్రి మరోవైపు, మంత్రులు నలువైపులా పర్యటించి ముంద జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల పల్లపు ప్రాంతాల్లో, రహదారులలో ప్రవహించిన నీరంతా మాయమైందన్నారు.
డీఎంకేను పత్తాలేకుండా చేస్తామంటున్న కొత్త నేతలకు నాలుగేళ్లుగా డీఎంకే అమలు చేసిన పథకాల వల్ల రాష్ట్రం ఎదుగుతున్న విషయం తెలియకపోవడం శోచనీయమన్నారు. డీఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై పనిగట్టుకుని విమర్శలు చేసే ప్రత్యర్థుల నుద్దేశించి ‘విమర్శకులు వర్థిల్లాలి’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చి ఊరుకునేవారని, ఆ నేత బాటలోనే తాను కూడా పసలేని విమర్శలు చేసేవారికి సమాధానాలిచ్చి తన విలువైన సమయాన్ని వృథా చేయదలచుకోలేదని అన్నారు.
ఈవార్తను కూడా చదవండి: మినరల్ కాదు.. జనరల్ వాటరే
ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్ అంటూ మోసం: హరీశ్‌రావు
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్, హరీశ్ ఇళ్ల ముందు ధర్నా చేయండి
ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు
Read Latest Telangana News and National News