ఈవీఎంలను హ్యాక్ చేశారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
ABN , Publish Date - Oct 10 , 2024 | 06:07 AM
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల

న్యూఢిల్లీ, అక్టోబరు 9: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఢిల్లీలోని ఎన్నికల సం ఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. కనీసం 20 నియోజకవర్గాల్లో ఈవీఎంలను హ్యాక్ చేశారని చెబుతూ 7 నియోజకవర్గాల్లో జరిగిన అవకతవకలపై ఆధారాలు సమర్పించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వెల్లడించారు. మిగతా 13 నియోజకవర్గాలకు సంబంధించిన ఆధారాలు 48 గంటల్లో సమర్పిస్తామని ఈసీకి తెలిపామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిన చోట్ల ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99ు చూపాయని, అభ్యర్థులు గెలిచిన చోట్ల ఈవీఎం ల బ్యాటరీ ఛార్జింగ్ 60ు-70ు మాత్రమే ఉందని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.