Kargil War: అమరవీరులకు రక్షణ మంత్రిత్వ శాఖ ఘన నివాళి
ABN , Publish Date - Jul 14 , 2024 | 06:55 PM
25వ వార్షికోత్సం సందర్బంగా కార్గిల్ యుద్ద వీరులకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఘన నివాళులర్పించింది. 25 సంవత్సరాల వీరోచిత శౌర్యంతోపాటు విజయాన్ని గుర్తు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ మాంటేజ్‌ను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
న్యూఢిల్లీ, జులై 14: 25వ వార్షికోత్సం సందర్బంగా కార్గిల్ యుద్ద వీరులకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఘన నివాళులర్పించింది. 25 సంవత్సరాల వీరోచిత శౌర్యంతోపాటు విజయాన్ని గుర్తు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ మాంటేజ్‌ను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 25 సంవత్సరాల క్రితం.. ఇదే రోజు ఆపరేషన్ విజయ్ అద్భుత విజయం సాధించినట్టు ప్రకటించింది.
Also Read: Harash Nagotra: యువకుడు ఆత్మహత్య.. మోదీకి మృతుడి ఫ్యామిలీ లేఖ
Also Read: Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం
మన సైనికులు అత్యంత ఎత్తైన కార్గిల్ కొండల మధ్య నిలబడి శత్రు దేశంతో పోరాటం చేశారు. ఇది వారి అసాధారణ ధైర్యసాహసాలు, జాతి గర్వంతోపాటు గౌరవానికి ప్రతీక అని స్పష్టం చేసింది. కార్గిల్ విజయ్‌కు @ 25 ఏళ్లు. కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెప్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, మేజర్ రాజేశ్ సింగ్ అధికారి, మేజర్ వివేక్ గుప్తాతోపాటు పలువురు మరణించారు.
Also Read: BJP Chief: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగింపు..!
Also Read: AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు
దాదాపు 527 మంది సైనికులు ఈ యుద్దంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. సైనికులకు నివాళులర్పించడం, వారి శౌర్య, త్యాగాలను గౌరవ సూచికంగా జూన్ 12న భారత ఆర్మీ పాన్ ఇండియా మోటర్ సైకల్ సాహస యాత్రను చేపట్టింది. ఈ యుద్దంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన సైనికుల సేవలు తెలిసేలా భారత ఆర్మీ ఈ యాత్ర చేపట్టింది. ఈ యాత్ర "భారత సైన్యం యొక్క శాశ్వత స్ఫూర్తికి చిహ్నంగా పనిచేస్తుంది.
Also Read: LokSabha: కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్
ఈ కార్గిల్ యుద్దం.. 1999, 3 మే నుంచి జులై 26వ తేదీ వరకు జరిగింది. జులై 14వ తేదీన.. నాటి భారత ప్రధాని ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని ప్రకటించారు. అనంతరం పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ షరతులు విధించిన సంగతి తెలిసిందే. ఈ యుద్దనంతరం.. పాకిస్థాన్ ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను తిరిగి భారత్ తిరిగి స్వాధీనపరచుకున్నది. దీంతో ఈ యుద్ధానికి పూర్వం ఉన్న సరిహద్దుకి పాకిస్తాన్ వెనుతిరిగి వెళ్లింది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News