Share News

Arvind Kejriwal: బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘ఆప్’ ఆందోళన

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:06 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. అందుకోసం శనివారం న్యూఢిల్లీలోని దిన్ దయాళ్ ఉపాద్యాయ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

Arvind Kejriwal: బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ‘ఆప్’ ఆందోళన

న్యూఢిల్లీ, జూన్ 29: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. అందుకోసం శనివారం న్యూఢిల్లీలోని దిన్ దయాళ్ ఉపాద్యాయ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఆ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశాయి.

Also Read: Adilabad:మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత


అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, నియంత పాలన అంతం.. కోసం అంటూ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శించాయి. మరోవైపు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద అనుమతి లేదంటూ ఆప్ పార్టీకి చెందిన ఆందోళనకారులను పోలీసులు నిలిపివేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read: Ayodhya: ఆరుగురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు


ఇంకోవైపు కేజ్రీవాల్‌ను జైల్లోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని.. అందుకు అనుగుణంగా ఈడీ, సీబీఐ పరస్పరం సహకరించుకొంటున్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరబ్ ఈ రోజు ఉదయం ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా తన గొంతు వినిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తీహాడ్ జైల్లో ఉన్న ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ ఇటీవల పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Owaisi: నివాసంపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు


ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో మార్చి 21న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయనను తీహాడ్ జైలుకు తరలించారు. అయితే కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇటీవల బెయిల్ మంజురు చేసింది. ఆయనకు బెయిల్‌ మంజురు చేయడంపై ఈడీ అభ్యంతరం తెలిపింది. ఆ క్రమంలో కేజ్రీవాల్ బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దాంతో కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే విధించింది.

Also Read: Viral Video: గోదావరిలో దూకిన మహిళ..సోషల్ మీడియాలో వైరల్


ఇంకోవైపు ఇదే కేసులో తీహాడ్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడం ఆయన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందులోభాగంగా శనివారం ఆప్ శ్రేణులు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనలో ఆప్ కీలక నేతలు అతిషి, గోపాల్ రాయ్, దిలీప్ పాండే తదితరులు హాజరయ్యారు.

Latest Telugu News And National News

Updated Date - Jun 29 , 2024 | 04:16 PM