Delhi Liquor Scam: కేజ్రీకి మరో షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ABN , Publish Date - Jun 29 , 2024 | 05:05 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల సీబీఐ కస్టడీ శనివారం పూర్తయింది. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్‌ను(Arvind Kejriwal) కోర్టులో హాజరు పరిచారు.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల సీబీఐ కస్టడీ శనివారం పూర్తయింది. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్‌ను(Arvind Kejriwal) కోర్టులో హాజరు పరిచారు. విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీకి మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పు వెలువరించింది.
జులై 12 వరకు ఆయన రిమాండ్‌లో ఉండనున్నారు. కోర్టు తీర్పుతో కేజ్రీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలినట్టైంది. కేజ్రీవాల్‌ని మరి కాసేపట్లో తీహార్ జైలుకు తరలించనున్నారు.
ఆప్ నిరసనలు..
అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీలోని దిన్ దయాళ్ ఉపాద్యాయ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
ఆ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగానినాదాలు చేశాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం, నియంత పాలన అంతం.. కోసం అంటూ పార్టీ శ్రేణులు ప్లకార్డులను ప్రదర్శించాయి. మరోవైపు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద అనుమతి లేదంటూ ఆప్‌కి చెందిన ఆందోళనకారులను పోలీసులు నిలిపివేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
For Latest News and National News click here..