Share News

S.Jaishnakar US Visit: అమెరికాలో జైశంకర్ కీలక పర్యటన

ABN , Publish Date - Dec 23 , 2024 | 08:30 PM

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రెంప్ గెలిచిన తరువాత జైశంకర్ యూఎస్‌లో జరుపనున్న తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.

S.Jaishnakar US Visit: అమెరికాలో జైశంకర్ కీలక పర్యటన

న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jaishankar) డిసెంబర్ 24 నుంచి 29 వరకూ అమెరికా (United States)లో పర్యటించనున్నట్టు ఆయన కార్యాలయం సోమవారంనాడు ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తరువాత జైశంకర్ యూఎస్‌లో జరుపనున్న తొలి ఉన్నతస్థాయి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.

NHRC: ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్‌గా కొత్త చైర్మన్‌గా వి.రామసుబ్రమణ్యం


''జైశంకర్ తమ పర్యటనలో ఆదేశ విదేశాంగ మంత్రితో కీలక ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. యూఎస్ఎస్‌లోని భారత కాన్సుల్ జనరల్స్‌ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షత వహిస్తారు'' అని విదేశాంగ శాఖ (ఎంఈఓ) తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా డోనాల్డ్ ట్రంప్‌ను జైశంకర్ కలుస్తారా లేదా అనే విషయాన్ని ఎంఈఓ వెల్లడించలేదు.


కాగా, గత వారం యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) సమావేశంలో యూఎస్-ఇండియా పటిష్ట భాగస్వామ్యంపై భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్‌సెట్టి మాట్లాడారు. నిష్పాక్షికత, సమానత్వం ప్రాతిపదికగా తక్కువ పన్నులు, ఎక్కువ వాణిజ్యంపై కలిసికట్టుగా ఉభయదేశాలు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ, సామర్థ్యాన్ని కూడా కలిసి పంచుకోవాలని అన్నారు. భారతదేశంలోని వర్క్‌ఫోర్స్‌ను ఆయన ప్రశంసించారు.


ఇది కూడా చదవండి..

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

National Farmers Day: నేడు జాతీయ రైతు దినోత్సవం.. దీని చరిత్ర గురించి తెలుసా..

For National News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 08:32 PM