Share News

EC Vs Jairam Ramesh: సమాచారం ఇవ్వకపోతే చర్యలు.. జైరామ్ రమేష్‌కు ఈసీ అల్టిమేటం

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:35 PM

లోక్‌సభ ఎన్నికల అనంతరం 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్ చేసి వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యల వ్యవహారం ముదురుతోంది. దీనిపై ఈసీ సోమవారంనాడు జైరామ్ రమేష్‌కు అల్టిమేటం ఇచ్చింది.

EC Vs Jairam Ramesh: సమాచారం ఇవ్వకపోతే చర్యలు.. జైరామ్ రమేష్‌కు ఈసీ అల్టిమేటం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల అనంతరం 150 మంది జిల్లా మెజిస్ట్రేట్లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఫోన్ చేసి వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఇటీవల చేసిన వ్యాఖ్యల వ్యవహారం ముదురుతోంది. తన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలను ఆదివారం సాయంత్రంలోగా తమకు సమర్పించాలని ఇప్పటికే జైరామ్ రమేష్‌ను ఎన్నికల కమిషన్ (EC) కోరింది. ఈ నేపథ్యంలో తనకు మరో వారం రోజులు సమయం ఇవ్వాలని ఈసీని జైరామ్ రమేష్ సోమవారంనాడు కోరారు. అయితే ఆయన అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. ఈమేరకు జైరామ్ రమేష్‌కు ఒక లేఖ రాసింది. ఈరోజు (June 3)రాత్రి 7 గంటల్లోగా తమకు ఆధారాలను అందజేయాలని ఆదేశించింది.

CEC: ఇది మంచి పద్ధతి కాదు.. జైరామ్ రమేష్‌కు సీఈసీ అక్షింతలు


చర్చలు తీసుకోవాల్సి ఉంటుంది..

''గడువు పొడిగించాలని మీరు చేసుకున్న విజ్ఞప్తిని కమిషన్ నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చుతోంది. మీరు చేసిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలను ఈరోజు (జూన్ 3) రాత్రి 7 గంటల్లోగా మాకు అందజేయాలి. అలాకాని పక్షంలో మీవన్నీ నిరాధార ఆరోపణలుగా భావించి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది'' అని జైరామ్ రమేష్‌కు రాసిన లేఖలో ఈసీ స్పష్టం చేసింది. జైరామ్ రమేష్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, మంగళవారంనాడు కౌంటింగ్ జరగాల్సి ఉండటం, జిల్లా మెజిస్ట్రేట్లు ఎన్నికల అధికారులుగా, జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్నందున ఎన్నికల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని ఈసీ నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేసింది.

For Latest News and National News click here

Updated Date - Jun 03 , 2024 | 06:42 PM