Share News

Hero Vijay: మద్యం తాగి మహానాడుకు రావొద్దు..

ABN , Publish Date - Sep 26 , 2024 | 01:21 PM

విల్లుపురం జిల్లా విక్రవాండిలో అక్టోబరు 27న నిర్వహించనున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) మహానాడును విజయవంతం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి మహానాడులో పాల్గొనరాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌(Movie actor Vijay) సూచించారు.

Hero Vijay: మద్యం తాగి మహానాడుకు రావొద్దు..

- పార్టీ శ్రేణులకు విజయ్‌ నిబంధనలు

చెన్నై: విల్లుపురం జిల్లా విక్రవాండిలో అక్టోబరు 27న నిర్వహించనున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) మహానాడును విజయవంతం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి మహానాడులో పాల్గొనరాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌(Movie actor Vijay) సూచించారు. టీవీకే మొట్టమొదటి రాష్ట్రస్థాయి మహానాడు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన పార్టీ అధిష్ఠానం అందుకోసం విల్లుపురం జిల్లా చెన్నై-తిరుచ్చి(Chennai-Tiruchi) జాతీయ రహదారిలో విక్రవాండి నియోజకవర్గ పరిధిలో సుమారు 85 ఎకరాల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. పోలీసులు 33 నిబంధనలతో మహానాడు నిర్వహణకు అనుమతించిన నేపథ్యంలో, బుధవారం పార్టీ కార్యకర్తలకు కట్టుబాట్లు విధించినట్లు విజయ్‌ పేర్కొన్నారు.

దికూడా చదవండి: Heavy Rains: ముంబైలో కుంభవృష్టి.. స్తంభించిపోయిన మహా నగరం


వేదిక ప్రాంతంలోని రహదారిలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలిగించకూడదని, ముఖ్యంగా ద్విచక్రవాహనాల్లో వచ్చే పార్టీ క్యాడర్లు సాహసాలకు పాల్పడరాదని, మహానాడుకు భద్రత కల్పించే పోలీసుల పట్ల మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాలని, వేదిక ప్రాంగణంలో బావులు, ప్రమాదకరమైన ప్రాంతాలుంటే అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా మద్యం సేవించిన కార్యకర్తలను వేదిక ప్రాంగణంలోకి అనుమతించబోమని తదితర నిబంధనలను కార్యకర్తలంతా తప్పనిసరిగా పాటించాలని విజయ్‌ ఆదేశించారు.


.....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.....................................................................

Chennai: మెట్రోరైల్వేస్టేషన్‌లో అశ్లీల రీల్స్‌..

- ముగ్గురు విద్యార్థుల అరెస్టు

చెన్నై: స్థానిక కీల్పాక్కం మెట్రో రైల్వే స్టేషన్‌లో తన ప్రియురాలితో కలిసి అశ్లీలంగా రీల్స్‌ చేస్తున్న యువకుడిని మందలించిన మెట్రో రైల్‌ అధికారిపై జరిగిన దాడి కేసులో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. కీల్పాక్కం నెహ్రూ పార్క్‌ మెట్రో స్టేషన్‌(Keelpakkam Nehru Park Metro Station)లో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించేలా ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి రీల్స్‌ చేస్తున్నాడు. దీన్ని గమనించిన ఆ మెట్రో స్టేషన్‌ అధికారి ఆ యువకుడిని మందలించాడు.

nani2.jpg

ఇదికూడా చదవండి: కంగన కారుకూతలతో బీజేపీకి నష్టం


దీంతో అక్కడ నుంచి వెళ్ళిపోయిన ఆ యువకుడు.. కొంతసేపటికి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చి రైల్వే స్టేషన్‌ అధికారి ఆకాష్‏పై దాడి చేశాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన చింతాద్రిపేటకు కాలేజీ విద్యార్థి అబూబాకర్‌ సిద్ధిక్‌, చూలైకు చెందిన విజీ, డెవిస్‌లుగా గుర్తించి మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.


ఇదికూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర..

ఇదికూడా చదవండి: కవిత కేసు విచారణ అక్టోబరు 4కు వాయిదా

ఇదికూడా చదవండి: హై‘డ్రామా’లొద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 26 , 2024 | 01:21 PM