Hero Vijay: విద్యార్థులకు రెండు విడతలుగా ప్రోత్సాహకాల పంపిణి..
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:38 PM
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు విడతలుగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్(Actor Vijay) ప్రకటించారు. గత ఏడాది 10, 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి, సర్టిఫికెట్లను నటుడు విజయ్ అందజేసిన విషయం తెలిసిందే.
- టీవీకే అధ్యక్షుడు విజయ్
చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఆధ్వర్యంలో విద్యార్థులకు రెండు విడతలుగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్(Actor Vijay) ప్రకటించారు. గత ఏడాది 10, 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి, సర్టిఫికెట్లను నటుడు విజయ్ అందజేసిన విషయం తెలిసిందే. సుమారు 12 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు విజయ్ నిలబడే విద్యార్థులకు ప్రోత్సాహకాలు పంపిణి చేశారు. అలాగే, అందరితో వేర్వేరుగా సెల్ఫీ కూడా తీసుకున్నారు. విజయ్ సొంతఖర్చుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రకారం, ఈ ఏడాది కూడా పబ్లిక్ పరీక్షల్లో మార్కులు సాధించిన వారికి రెండు విడతలుగా నటుడు విజయ్ ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఆ ప్రకారం, తొలివిడతగా ఈ నెల 28వ తేది తిరువాన్మియూర్‌లోని రామచంద్ర కన్వెక్షన్ సెంటర్‌లో అభినందన సభ జరుగనుంది.
ఇదికూడా చదవండి: Assumed Charge: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విదేశాంగ మంత్రి జైశంకర్ బాధ్యతలు స్వీకరణ..మధ్యాహ్నం
ఈ సభలో అరియలూరు, కోయంబత్తూర్, ధర్మపురి, దిండుగల్, ఈరోడ్, కన్నియాకుమారి, కరూర్, కృష్ణగిరి, మదురై, నామక్కల్, నీలగిరి, పుదుకోట, రామనాధపురం, సేలం, శివగంగ, తెన్‌కాశి, తేని, తూత్తుకుడి, తిరునల్వేలి, తిరుప్పూర్, విరుదునగర్ తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులను నటుడు విజయ్ అభినందించనున్నారు. అలాగే, రెండో విడతగా జూలై 3వ తేది చెంగల్పట్టు, చెన్నై, కడలూరు, కళ్లకుర్చి, కాంచీపురం, కారైక్కాల్, మైలాడుదురై, నాగపట్టణం, పెరంబలూరు, పుదుచ్చేరి, రాణిపేట, తంజావూరు, తిరువళ్లూర్, తిరువణ్ణామలై, తిరువారూరు, తిరుపత్తూర్, తిరుచ్చి, వేలూరు, విల్లుపురం తదితర జిల్లాల విద్యార్థులకు నటుడు విజయ్ ప్రోత్సాహకాలు అందించి అభినందించనున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News