IMD: నేడు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్
ABN , Publish Date - Sep 13 , 2024 | 07:25 AM
దేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ ప్రాంతాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలోని పలు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు(rains) కురియనున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సెప్టెంబరు 13-14 తేదీల్లో ఉత్తరాఖండ్(Uttarakhand)లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో తేలిక పాటి వర్షాలు కురియనున్నాయి. తూర్పు, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హర్యానాలో నేడు, రేపు, సెప్టెంబర్ 14 వరకు రాజస్థాన్‌లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
భారీ వర్షాలు
సెప్టెంబర్ 13న ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఒరిస్సా, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలలో ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌పై ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో
మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో సెప్టెంబర్ 19 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా లక్షద్వీప్, కేరళలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురియనున్నాయి. రాజస్థాన్‌లో రానున్న 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో కూడా వర్షాలు కురియనున్నాయి. ఇక్కడ సిమ్లా, సిర్మౌర్, కులు, కిన్నౌర్ జిల్లాల్లో వరదలు సంభవించవచ్చని ఐఎండీ తెలిపింది.
జాగ్రత్త
భారీ వర్షాల వేళ అనేక జిల్లాల్లో వరదలు సంభవించవచ్చు. దీంతోపాటు లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు చేరే ఛాన్స్ ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య ఏర్పడి రోడ్లపై ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో వెదర్ రిపోర్ట్ అంచనాలు తెలుసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
ప్రధాని, సీజేఐ భేటీపై అనుమానాలున్నాయ్
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
హైదరాబాద్ టు బ్యాంకాక్ విమాన సర్వీసులు
Read More National News and Latest Telugu News