Weather News: వెదర్ అలర్ట్.. ఆ రాష్ట్రాలకు వర్షాలు.. ఈ రాష్ట్రాలకు ఎండలు..!!
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:40 PM
ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా వేసవి ( Summer ) ఎండలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఉదయం 7 నుంచే మొదలయ్యే ఎండ సాయంత్రం 7 అయినా తగ్గడం లేదు.
ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా వేసవి ( Summer ) ఎండలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఉదయం 7 నుంచే మొదలయ్యే ఎండ సాయంత్రం 7 అయినా తగ్గడం లేదు. దీంతో ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రాత్రి వేళల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం పెరిగిపోతుండటం, గాల్లో తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిస్థితుల నడుమ భారత వాతావరణ విభాగం - ఐఎండీ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 20 వరకు పలు రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వారం మొత్తం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
Elections 2024: అవినీతికి ఛాంపియన్ ప్రధాని మోదీ.. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో రాహుల్ ఫైర్..
రానున్న ఐదు రోజుల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరగుతాయని వెల్లడించింది. మరోవైపు.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయని వివరించింది. ఏప్రిల్ 18-20 వరకు పంజాబ్, హర్యానా, ఛండీగఢ్, దిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Ayodhya: అయోధ్య రాముడికి అపూర్వ ఘట్టం.. ఆ వేడుకనూ మీరూ చూసేయండి..
విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికైన, లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలంది. తలపై గుడ్డ, టోపీ లేదా గొడుగును ఉపయోగించాలని సూచించింది. వీలైనంత వరకు ఇంటి వద్దే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని తెలిపింది. బయటకు వెళ్తే కనీస జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.