Share News

IPL 2025, PBKS vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - Mar 25 , 2025 | 07:03 PM

పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు చాలా బలంగా కనబడుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా యువ రక్తంతో తొణికిసలాడుతోంది.

IPL 2025, PBKS vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
pbks vs gt

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బలమైన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు చాలా బలంగా కనబడుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా యువ రక్తంతో తొణికిసలాడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ మొదటి బ్యాటింగ్ చేయబోతోంది.


తుది జట్లు:

పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్రభు సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, ప్రియాంష్ ఆర్య, సూర్యాంశ్, అజ్మతుల్లా, మార్కో జెన్సన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర ఛాహల్

గుజరాత్ టైటన్స్: శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 07:13 PM