Arvind Kejriwal: మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన రిజిస్ట్రేషన్ ఎప్పట్నించంటే
ABN , Publish Date - Dec 22 , 2024 | 02:50 PM
మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళా లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పథకాలు కీలకంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ''మహిళా సమ్మాన్ యోజన'' (Mahila Samman Yojana), 'సంజీవిని యోజన' (Sanjeevani Yojana) పథకాల రిజిస్ట్రేషన్ డిసెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆదివారంనాడు ప్రకటించారు. మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళా లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పథకాలు కీలకంగా ఉన్నాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి మళ్లీ కోర్టు సమన్లు
''మహిళలు, సోదరీమణులకు రూ.2,100 బోనస్ మేము ప్రకటించాం. ఈ స్కీమ్ ప్రకటించినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుందని అడుగుతున్నారు. మహళా సమ్మాన్ నిధి కోసం రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ఢిల్లీలో మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం మేము మీ ఇంటికి వస్తాం" అని కేజ్రీవాల్ చెప్పారు.
సీనియర్ సిటిజన్ల కోసం 'సంజీవని యోజన'
కాగా, 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య చికిత్స కోసం "సంజీవని యోజన" పథకాన్ని ఆప్ ప్రకటించింది. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ట పరిమితి అనేది లేదు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా డిసెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం కానుందని కేజ్రీవాల్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్‌కు ఢిల్లీ ఓటర్ ఐడీ మాత్రం తప్పనిసరని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు తాను, ముఖ్యమంత్రి అతిషి, సీనియర్ నేత మనీష్ సిసిడియా కలిసి ప్రజలను కలుస్తామని, తమ చేతుల మీదుగా కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారు.
Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు
Rains: 25నుంచి మళ్లీ కుండపోత వర్షాలు..
For National News And Telugu News