Share News

Rajnath Appel: మోదీ మాట్లాడేటప్పుడు సభలో అడ్డుపడకండి.. అఖిలపక్షంలో రాజ్‌నాథ్ అప్పీల్

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:59 PM

పార్లమెంటు ఉభయసభల్లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులు అడ్డుపడరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆదివారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ అప్పీల్ చేశారు.

Rajnath Appel: మోదీ మాట్లాడేటప్పుడు సభలో అడ్డుపడకండి.. అఖిలపక్షంలో రాజ్‌నాథ్ అప్పీల్

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులు అడ్డుపడరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కోరారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆదివారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో (All-party meeting) ఆయన ఈ అప్పీల్ చేశారు. ఇటీవల రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పేందుకు ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతుండగా ఉభయసభల్లో సభ్యులు అడ్డుతగలడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్‌నాథ్ ఈ విజ్ఞప్తి చేశారు. ఇదెంత మాత్రం పార్లమెంటరీ సంప్రదాయం కాదన్నారు. అఖిలపక్ష సమావేశానంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయం మీడియాకు తెలిపారు.


సభ్యులంతా ప్రజాసామ్య పరిపుష్టతకు కృషి చేయాలని, సభా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవడం కానీ, అంతరాయం కలిగించడం కానీ చేయరాదని అఖిలపక్ష సమావేశంలో రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేసినట్టు రిజిజు తెలిపారు. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు మంచి సూచనలు చేసిన అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సభలను సజావుగా నడిపే బాధ్యత ఇటు ప్రభుత్వంతో పాటు అటు విపక్షాలకు కూడా ఉంటుందన్నారు.

All party meet: డిప్యూటీ స్పీకర్ పదవి కోరిన కాంగ్రెస్, నీట్ అంశం ప్రస్తావన


స్పెషల్ కేటగిరి స్టేటస్‌కు డిమాండ్లు..

కాగా, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో జేడీయూ, వైఎస్ఆర్‌సీపీ కోరినట్టు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఒడిశాకు ప్రత్యేక కేటగిరి స్టాటస్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు బీజేడీ నేత సస్మిత పాత్ర తెలిపారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకూ పార్లమెంటు వర్షాకాల బడ్జెట్ సమావేశాలు జరుగనుండగా, 23వ తేదీ సోమవారంనాడు 2024-25 సంవత్సరానికి పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 21 , 2024 | 04:59 PM