Share News

Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముఖేష్ అంబానీ పూజలు, రూ.5 కోట్లు విరాళం

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:39 PM

రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.

Mukesh Ambani: బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో ముఖేష్ అంబానీ పూజలు, రూ.5 కోట్లు విరాళం

డెహ్రాడూన్: రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్ (Kedarnath), బద్రీనాథ్ (Badrinath) మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. బద్రీనాథ్‌ చేరుకోగానే ఆయనకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు. చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ ఆలయం, రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యక పూజలు చేసిన అనంతరం టెంపుల్ కమిటీకి ఆయన రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ముఖేష్ అంబానీ గత ఏడాది కూడా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయ దర్శనానికి వచ్చారు. అయితే అప్పుడు ఆయన కుటుంబసభ్యులు కూడా వచ్చారు.

PM Modi Varanasi Vist: మోదీపై కంచి శంకరాచార్య ప్రశంసలు.. ఎన్డీయేకి కొత్త అర్ధం చెప్పిన స్వామీజీ


నవంబర్ 3న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు మూత

శీతాకాలం సీజన్‌లో కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలు మంచుతో కప్పబడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు కేదార్‌నాథ్ థామ్ ద్వారాలు మూతపడతాయి. బద్రీనాథ్ ద్వారాలు నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూసివేస్తారు. నవంబర్ 2న గంగోత్రి ద్వారాలు, నవంబర్ 4న తుంగనాథ్, నవంబర్ 20న మధ్యమహేశ్వర్ ద్వారాలు మూతపడతాయి.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Maharashtra Polls: 99 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా.. బరిలో ప్రముఖులు

Updated Date - Oct 20 , 2024 | 08:40 PM