Viral News: వీరిని పట్టిస్తే 10 లక్షలు: ఎన్ఐఏ
ABN , Publish Date - Jun 26 , 2024 | 08:52 AM
పంజాబ్లో విశ్వహిందూ పరిషత్ (VHP) నేత వికాస్ ప్రభాకర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం విడుదల చేసింది. వీరు ఎక్కడున్నా ప్రాణాలతో పట్టిస్తే రూ.10 లక్షల నగదు ఇస్తామని ప్రకటించింది.
చంఢీగఢ్: పంజాబ్లో విశ్వహిందూ పరిషత్ (VHP) నేత వికాస్ ప్రభాకర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం విడుదల చేసింది. వీరు ఎక్కడున్నా ప్రాణాలతో పట్టిస్తే రూ.10 లక్షల నగదు ఇస్తామని ప్రకటించింది.
పంజాబ్లోని నవన్షహర్లోని గర్పాధన గ్రామానికి చెందినహర్జిత్ సింగ్ అలియాస్ లడ్డీ, హరియాణాలోని యమునా నగర్ వాసి కుల్బీర్ సింగ్ అలియాస్ సిద్ధూని నిందితులుగా గుర్తించారు.
జరిగిందిదే...
వికాస్ బగ్గా అలియాస్ ప్రభాకర్ విశ్వ హిందూ పరిషత్ నంగల్ అధ్యక్షుడిగా పనిచేసేవారు. ఆయన్ని 2024 ఏప్రిల్ 13న పంజాబ్లోని రూప్నగర్ జిల్లా నంగల్ పట్టణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభాకర్ హత్యపై దర్యాప్తున కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు సిఫారసు చేసింది. హత్య చేసిన వారిని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు కూడా ఇస్తామని ప్రకటించింది.
నిందితులకు సంబంధించిన సమాచారం తెలిస్తే ఫోన్ నంబర్: 011-24368800, WhatsApp/టెలిగ్రామ్: 8585931100, ఇమెయిల్ ID: do.nia@gov.inలో సమాచారాన్ని చెప్పాలని ఎన్ఐఏ సూచించింది. వీటితోపాటు చంఢీగఢ్ పోలీసుల ఫోన్ నంబర్లు: 0172-2682900, 2682901లో కూడా సంప్రదించవచ్చు. WhatsApp/టెలిగ్రామ్ నంబర్: 7743002947, ఇమెయిల్: info-chd.nia@gov.inలో నిందితుల సమాచారాన్ని ఇవ్వాలని ఎన్ఐఏ సూచించింది.
.For Latest News and National News click here..