Share News

Nita Ambani: నీతా అంబానీ ధరించిన చీర ఇంత స్పెషలా?

ABN , Publish Date - Jul 13 , 2024 | 07:19 AM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం ముంబయిలో ఘనంగా జరుగుతోంది. 3 రోజులపాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం దేశ విదేశాల నుంచి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

Nita Ambani: నీతా అంబానీ ధరించిన చీర ఇంత స్పెషలా?

ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం ముంబయిలో ఘనంగా జరుగుతోంది. 3 రోజులపాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం దేశ విదేశాల నుంచి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు, టాలీవుడ్ నుంచి మహేశ్ బాబు దంపతులు, రాంచరణ్ దంపతులు, చిరంజీవి, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. క్రీడాకారులు సానియా మీర్జా, ఆమె సోదరి వివాహానికి వెళ్లారు. అయితే ఈ వేడుకలో ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ధరించిన చీరపైనే అందరి దృష్టి పడింది.


బంగారంతో పొదిగిన సిల్క్ ఘాగ్రా..

వివాహ వేడుకలో నీతా అంబానీ బనారసీ సిల్క్ ఘాగ్రా ధరించారు. ఈ దుస్తులను అబు జానీ, సందీప్ ఖోస్లా డిజైన్ చేశారు. చీరపై స్వదేశీ, సంప్రదాయ బనారసీ లెహెరియా దుపట్టా ధరించారు. దీనిని ఆర్టిజన్లు విజయ్ కుమార్, మౌనికా మౌర్య రూపొందించారు. బంగారాన్ని పొదిగిన రూ.కోట్ల విలువైన ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో నీతా అంబానీ చాలా అందంగా కనిపించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 07:45 AM