Google Maps: ఈ నగరంలో వాహనంపై వెళ్లడం కంటే.. నడిచి వెళ్లడం ఉత్తమం
ABN , Publish Date - Jul 31 , 2024 | 02:01 PM
దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే దేశ ప్రజలను మాత్రం పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటి. ట్రాఫిక్ సమస్య. ఈ సమస్య వల్ల ఇబ్బంది పడని వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదేమో. రోజురోజుకు జనాభా పెరగుతుంది. అందుకు సరిపడా రహదారులు, మౌలిక సదుపాయాలు మాత్రం పెరగడం లేదు. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వాలు సైతం చేతులెత్తేస్తున్నాయి.
దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే దేశ ప్రజలను మాత్రం పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటి. ట్రాఫిక్ సమస్య. ఈ సమస్య వల్ల ఇబ్బంది పడని వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదేమో. రోజురోజుకు జనాభా పెరగుతుంది. అందుకు సరిపడా రహదారులు, మౌలిక సదుపాయాలు మాత్రం పెరగడం లేదు. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వాలు సైతం చేతులెత్తేస్తున్నాయి. దీంతో రహదారులపై వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు.
Also Read: Preeti Sudan: యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రీతి సుదాన్ నియామకం
ట్రాఫిక్‌ను గాలికి వదిలేసిన పోలీసులు..
అదీకాక ట్రాఫిక్ నియంత్రించే పోలీసులు సైతం విధి నిర్వహణలో భాగంగా వాహనదారులకు చలాన్లు రాసే పనిలో పడి పోయారు. దీంతో ట్రాఫిక్‌ను సైతం వారు గాలికి వదిలేశారు. దాంతో నగరాలు, మహా నగరాలే కాదు.. చిన్న చిన్న పట్టాణాల్లోని ప్రజల సైతం ట్రాఫిక్‌లో చిక్కుకొంటున్నారు. దీంతో గంటల గంటల సమయాన్ని ఈ ట్రాఫిక్‌లోనే ప్రజలు గడిపేస్తున్నారు. అంతగా ట్రాఫిక్ సమస్య ఎప్పుడో అప్పడు, ఎక్కడో అక్కడ తీవ్రంగా వేధిస్తుంది.
Also Read: AAP Govt : ఢిల్లీలో కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం..!
ఐటీ క్యాపిటిల్ ఆఫ్ ఇండియా..
కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ మహానగరం ఐటీ క్యాపిటిల్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గాంచింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారికే కాదు.. విదేశీయులు సైతం కొలువులు లభించడంతో ఈ మహానగరంలో స్థిరపడిపోయారు. దీంతో ఈ నగరం కాస్తా నలుదిక్కుకు విస్తరించి మహానగరంగా విలసిల్లుతోంది. ఆ క్రమంలో ట్రాఫిక్ సైతం భారీగా కాదు అత్యంత భారీగా పెరిగిపోయింది. దాంతో ఆఫీసులకు వెళ్లి వచ్చే సమయంలో అయితే ఈ ట్రాఫిక్ సమస్యలతో ప్రజలకు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు.
Also Read: Sindhudurg: లలిత భర్త సతీశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
తనదైన శైలిలో స్పందించిన ఆయుష్ సింగ్..
అలాంటి వేళ బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ సమస్యపై తనదైన శైలిలో స్పందించారీ ఆయూష్ సింగ్. ఈ నగరంలో ఈ ట్రాఫిక్‌లో నడిచి వెళ్లితే ఎంత సమయం తీసుకుంటుంది. అదే వాహనంలో వెళ్లితే ఎంత సమయం పడుతుందంటూ ఓ ప్రయోగం చేశారు. ఆ క్రమంలో నగరంలోని బ్రిగేడ్ మెట్రోపాలిస్ నుంచి ఆర్కే పురం రైల్వే స్టేషన్ వరకు.. అంటే 6 కిలోమీటర్లు. ఒక సారి వాహనంలో వెళ్లారు. మరోసారి నడిచి వెళ్లారు. అయితే వాహనంలో వెళ్లినప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకుని.. 44 నిమిషాలు పట్టింది. అదే నడుచుకుంటూ వెళ్లితే మాత్రం 42 నిమిషాలు సమయం సరిపోయింది.
Also Read: Kerala: ఎర్నాకుళం- బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం..!
గూగుల్ మ్యాప్స్...
దీంతో వాహనంపై వెళ్లడం కంటే.. నడిచి వెళ్లడం వల్లే తొందరగా వెళ్లారంటూ గూగుల్ మ్యాప్స్ సైతం క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇలా బెంగళూరులో మాత్రం జరుగుతుందంటూ ఆయూష్ సింగ్ కామెంట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్క రోజులో దాదాపు 3 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు.
Also Read:IAS aspirants’ death in Delhi: మృతులు ముగ్గురు కాదు.. 10 నుంచి 12 మంది..
నెటిజన్ల స్పందన...
అంతేకాదు ఆయుష్ సింగ్ వ్యాఖ్యలతో నెటిజన్లు అత్యధిక సంఖ్యలో ఏకీభవించారు. మరో నెటిజన్ అయితే ప్రపంచంలోని మెట్రో నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సైతం ఇదే పరిస్థితి నెలకొందని వారు అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్ అయితే.. బెంగళూరు నగరం.. ట్రాఫిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తు కామెంట్ చేయడం గమనార్హం.
Also Read: Wayanad landslides: 156కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా
Read More National News and Latest Telugu News