Share News

PM Internship: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో 2,200 వేకెన్సీలు

ABN , Publish Date - Oct 05 , 2024 | 05:14 AM

పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో శుక్రవారం నాటికి 2,200 శిక్షణ అవకాశాలు(ఇంటర్న్‌షిప్‌ వేకెన్సీలు) నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.

PM Internship: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో 2,200 వేకెన్సీలు

న్యూఢిల్లీ, అక్టోబరు 4: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో శుక్రవారం నాటికి 2,200 శిక్షణ అవకాశాలు(ఇంటర్న్‌షిప్‌ వేకెన్సీలు) నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న ఈ పథకం అమలుకు రూ.800 కోట్లు వ్యయం కానుంది.


వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి 1.25 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ అందజేయాలన్న లక్ష్యంతో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఈ పోర్టల్‌ను రూపొందించింది. ఆసక్తికల అభ్యర్థులు ఈ నెల 12 నుంచి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.

Updated Date - Oct 05 , 2024 | 05:14 AM