Share News

P. Susheela: ప్రముఖ గాయని పీ.సుశీలకు అస్వస్థత

ABN , Publish Date - Aug 18 , 2024 | 06:44 AM

ప్రముఖ గాయని పీ.సుశీల అస్వస్థతకు గురయ్యాడు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

P. Susheela: ప్రముఖ గాయని పీ.సుశీలకు అస్వస్థత

చెన్నై: ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ.సుశీల అస్వస్థతకు గురయ్యాడు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా పీ సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యాడు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. 86 ఏళ్ల సుశీల కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరినట్టు తెలుస్తోంది.


నిలకడగా ఆరోగ్యం..

గాయని పి సుశీల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఉందని హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. సూచించిన మందులతో కడుపు నొప్పి తగ్గిపోతుందని వివరించారు. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు. కాగా ప్రముఖ గాయని అయిన పీ. సుశీల లెక్కలేనన్ని పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని, హాస్పిటల్ నుంచి డిచార్జ్ అవ్వాలని సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - Aug 18 , 2024 | 06:54 AM