Share News

Pune: కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్

ABN , Publish Date - May 20 , 2024 | 02:12 PM

పుణేలో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు పోర్సే కారు వేగంగా వచ్చింది. తన ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి పడ్డారు. స్పాట్‌లోనే చనిపోయారు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కారు నడిపిన వ్యక్తిని బయటకు తీశారు. దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. చిన్న వయస్సు ఉంది. ఆ యువకుడికి 17 ఏళ్లు అని తేలింది. క్లబ్‌లో పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది.

Pune: కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
pune teen get bail

పుణే: మైనర్లకు లైసెన్స్ ఇవ్వరు. వితౌట్ గేర్ స్కూటీ లాంటి వాహనాలు నడిపేందుకు మాత్రం అనుమతి ఉంటుంది. కొందరు ధనవంతుల పిల్లలకు ఆ నిబంధనలు వర్తించవు. అవును.. మైనర్ల వాహనాలు నడపొచ్చు. లైసెన్స్ లేకున్నా ఫర్లేదు. రోడ్డు మీద వాహనాలు నడపొచ్చు.. ప్రమాదాలు చేయొచ్చు.. నిన్న పుణేలో జరిగిన ఘటన దీనికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. పోర్సే కారుతో ఢీ కొన్న మైనర్ బాలుడికి అతని తండ్రి కేవలం 15 గంటల్లోనే బెయిల్ ఇప్పించారు. ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. అయినప్పటికీ ఆ ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. కేసు నమోదు చేశారు.. వివిధ సెక్షన్లు జోడించారు. గంటల్లోనే ఆ నిందితుడు మైనర్‌ అని వదిలేశారు.


ఏం జరిగిందంటే..?

పుణేలో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు పోర్సే కారు వేగంగా వచ్చింది. తన ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి పడ్డారు. స్పాట్‌లోనే చనిపోయారు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కారు నడిపిన వ్యక్తిని బయటకు తీశారు. దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. చిన్న వయస్సు ఉంది. ఆ యువకుడికి 17 ఏళ్లు అని తేలింది. క్లబ్‌లో పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ యువకుడు రియల్ ఎస్టేట్ డెవలపర్ కొడుకు అని తెలిసింది. కేసు నమోదు చేశారు. కుమారుడిని బయటకు తీసుకొచ్చేందుకు రియల్ ఎస్టేట్ డెవలపర్ బాగానే ఖర్చు చేసినట్టు ఉన్నారు. అందుకే 15 గంటల్లో కుమారుడికి బెయిల్ ఇప్పించారు.


  • బెయిల్ ఇచ్చే సమయంలో న్యాయమూర్తి ఆ యువకుడికి షరతులు విధించారు.

  • ఎరవాడ ట్రాఫిక్ పోలీసులతో 15 రోజులు పనిచేయాలి.

  • ప్రమాదాలపై వ్యాసం రాయాలి

  • మద్యం సేవించకుండా ఉండేందుకు చికిత్స తీసుకోవాలి

  • అలాగే కౌన్సిలింగ్ తీసుకోవాలి.



Read Latest Crime News and Telugu News

Updated Date - May 20 , 2024 | 02:15 PM