Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
ABN , Publish Date - Sep 23 , 2024 | 10:33 AM
న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆ కొన్ని గంటలకే పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సైతం తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టారు.
పంజాబ్, సెప్టెంబర్ 23: న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆ కొన్ని గంటలకే పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సైతం తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఐదుగురు కొత్త వారిని ఆయన తన కేబినెట్‌లోకి తీసుకోంటున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Also Read: Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా బంద్
అలాగే ప్రస్తుతం మాన్ కేబినెట్‌లోని నలుగురు మంత్రులను సీఎం మాన్ తొలగించనున్నారు. కొత్తగా మాన్ కేబినేట్‌లో చోటు దక్కించుకున్న ఎమ్మెల్యేలు.. బిరిందర్ కుమార్ గోయల్, డాక్టర్ రాజివట్, తరణ్ ప్రీత్ సింగ్, మహిందర్ భగత్, హర్దీప్ సింగ్‌లను సీఎం మాన్ కాగా.. ఇక చేతన్ సింగ్, శంకర్ జింపా, బల్కర్ సింగ్, అన్మోల్ గగన్ మాన్‌లు కేబినెట్ నుంచి ఉద్వాసన పొందుతున్నారు.
Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం భగవంత్ సింగ్ మాన్ కేబినెట్‌లో ఆయనతో కలిపి 15 మంది ఉన్నారు.
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాలకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడ సంతకం చేయకూడదంటూ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
దీంతో సీఎం పదవికి అతిషిని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ఢిల్లీ సీఎంగా అతిషి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఆమె కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఢిల్లీ సీఎంగా అతిషి .. సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ పరిమాణామాలు చోటు చేసుకున్న కొన్ని గంటలకే పంజాబ్‌లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో సైతం దాదాపుగా అదే తరహా ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News