Share News

Rice: వామ్మో.. ఇలా అయితే ఎలా కొనేది.. 20శాతం పెరిగిన బియ్యం ధరలు.. కిలో ఎంతంటే..

ABN , Publish Date - Jan 02 , 2024 | 01:03 PM

రాష్ట్రవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగాయి. తిరుచ్చి జిల్లాలో వరి దిగుబడులు తగ్గడంతో ధరలు 20శాతం పెరిగాయి. తిరుచ్చి మనచ్చి నల్లూర్‌, అరియమంగళం, కాట్టూరు ప్రాంతాల్లో ఉన్న బియ్యం మిల్లులకు ఈప్రాంతాల నుంచే కాకుండా

Rice: వామ్మో.. ఇలా అయితే ఎలా కొనేది.. 20శాతం పెరిగిన బియ్యం ధరలు.. కిలో ఎంతంటే..

ఐసిఎఫ్‌(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగాయి. తిరుచ్చి జిల్లాలో వరి దిగుబడులు తగ్గడంతో ధరలు 20శాతం పెరిగాయి. తిరుచ్చి మనచ్చి నల్లూర్‌, అరియమంగళం, కాట్టూరు ప్రాంతాల్లో ఉన్న బియ్యం మిల్లులకు ఈప్రాంతాల నుంచే కాకుండా తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, కావేరి డెల్టా జిల్లాల నుంచి బియ్యం దిగుమతి అవుతోంది. అలాగే, కర్ణాటక నుంచి వచ్చే వడ్లను బియ్యంగా మార్చి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ లోడుతో ధాన్యం దిగుమతి అవడంతోపాటు తిరుచ్చి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగాయి. గత ఏడాది జనవరిలో కర్ణాటక పొన్ని బియ్యం కిలో రూ.46 విక్రయం కాగా, చిల్లర విక్రయాల్లో రూ.55 నుంచి రూ.60వరకు ధర నిర్ణయించారు. అలాగే, మనచ్చి నల్లూర్‌ పొన్ని కిలో రూ.65, సాధారణ బియ్యం రూ.40 నుంచి రూ.51సహా అన్నిరకాల బియ్యంధరలు పెరిగాయి.

Updated Date - Jan 02 , 2024 | 01:03 PM