Share News

Sengol: రాష్ట్రపతి వెంట తీసుకెళ్లిన సెంగోల్ ప్రత్యేకతిదే

ABN , Publish Date - Jan 31 , 2024 | 02:58 PM

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Drowpadi Murmu) ఇరు సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

Sengol: రాష్ట్రపతి వెంట తీసుకెళ్లిన సెంగోల్ ప్రత్యేకతిదే

ఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Drowpadi Murmu) ఇరు సభలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ప్రధాని మోదీ(PM Modi), లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా(OM Birla) తదితరులు ఉన్నారు.

అయితే ముర్ము పార్లమెంటులోకి ప్రవేశించేముందే రాజ దండాన్ని తీసుకెళ్తున్న ఒకరు ఆమె ముందు నడిచారు. అలా వెళ్తుండగా పక్కన సంగీతాన్ని వినిపిస్తున్నారు. కుర్చీ దగ్గరకు రాగానే రాష్ట్రపతి తనకు ఎదురుగా రాజదండాన్ని ఉంచారు.


సెంగోల్ ప్రాధాన్యత ఇదే..

సెంగోల్ అనే రాజదండానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందాక బానిసత్వపు సంకెళ్లు తెంచుకుని జరిగిన అధికార మార్పిడికి ఇది నిదర్శనంగా నిలిచింది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు బ్రిటిష్ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఈ రాజదండాన్ని అందించారు. దీనినే సెంగోల్ అని పిలుస్తున్నారు.

Updated Date - Jan 31 , 2024 | 02:58 PM