Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

బీఎస్‌‌‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌గా సుమన్‌ కుమారి

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:45 AM

బీఎ్‌సఎఫ్‌ దళంలో తొలి మహిళా స్నైపర్‌గా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ కుమారి గుర్తింపు పొందారు. ఇండోర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌ (సీఎ్‌సడబ్లూటీ)లో ఎనిమిది వారాల పాటు శిక్షణ పొంది ఈ ఘనతను సాధించారు.

బీఎస్‌‌‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌గా  సుమన్‌ కుమారి

న్యూఢిల్లీ, మార్చి 3: బీఎ్‌సఎఫ్‌ దళంలో తొలి మహిళా స్నైపర్‌గా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ కుమారి గుర్తింపు పొందారు. ఇండోర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌ (సీఎ్‌సడబ్లూటీ)లో ఎనిమిది వారాల పాటు శిక్షణ పొంది ఈ ఘనతను సాధించారు. బీఎ్‌సఎఫ్‌ జవాన్లకు కమాండో శిక్షణ తరువాత అత్యంత కఠినమైన స్నైపర్‌ శిక్షణ ఇస్తారు. మొత్తం 56 మంది ఈ శిక్షణ పొందగా అందులో ఏకైక మహిళ సుమన్‌ కుమారే కావడం విశేషం. ఈ శిక్షణలో ప్రతిభ చూపించిన వారికి ఆల్ఫా, బ్రేవో గ్రేడ్లు ఇస్తారు. అయితే ఆమెకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించిన ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌ ఇచ్చినట్టు ఆ శిక్షణ కేంద్రం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ భాస్కర్‌ సింగ్‌ రావత్‌ చెప్పారు. దీంతో ఆమె స్నైపర్లకు శిక్షణ ఇచ్చే స్థాయిని పొందారని వివరించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ జిల్లా సుమన్‌ కుమారి స్వస్థలం.

Updated Date - Mar 04 , 2024 | 08:11 AM