Punjab: విద్యుత్, విద్య ఉచితం.. ఎన్నికల ప్రచారానికి సునీత కేజ్రీవాల్ శ్రీకారం
ABN , Publish Date - Jul 20 , 2024 | 05:37 PM
'ఉచిత' హామీలతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శనివారంనాడు శ్రీకారం చుట్టింది. ఉచిత విద్యుత్- 24 గంటల నిరంతర విద్యుత్, ఉచిత వైద్య చికిత్స, ఉచిత విద్య, మహిళలకు రూ.1000 చొప్పన ప్రతినెలా ప్రోత్సాహకాలు, యువకులందరికీ ఉద్యోగం వంటి 5 హామీలను ప్రకటించింది.
పంచకుల: 'ఉచిత' హామీలతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి (Punjab Assembly elections campaign) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) శనివారంనాడు శ్రీకారం చుట్టింది. ఉచిత విద్యుత్- 24 గంటల నిరంతర విద్యుత్, ఉచిత వైద్య చికిత్స, ఉచిత విద్య, మహిళలకు రూ.1000 చొప్పన ప్రతినెలా ప్రోత్సాహకాలు, యువకులందరికీ ఉద్యోగం వంటి 5 హామీలను ప్రకటించింది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తరఫున ఆయన భార్య సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal) 'ఢిల్లీ సీఎం గ్యారెంటీస్' పేరుతో ముందస్తు ప్రచారాన్ని ప్రారంభించారు. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జైలులో ఉండటంతో హర్యానాలో పార్టీ గెలుపు బాధ్యతను సునీత తీసుకున్నారు. పంచకుల టౌన్ హోల్‌లో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ గ్యారెంటీలను ఆమె ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) సందీప్ పాఠక్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Udayanidhi Stalin: మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే.. ప్రమోషన్ వార్తలపై ఉదయనిధి స్టాలిన్
ఒంటరిగానే ఎన్నికల బరిలోకి..
కాగా, హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ సాస్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని 'ఆప్' ఇప్పటికే ప్రకటించింది. జూలై 20న అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ గ్యారెంటీలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ ఏడాది చివర్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది.