Waqf Bill: జేపీసీ మీటింగ్‌లో గ్లాస్ బాటిల్ విసిరికొట్టిన టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
ABN , Publish Date - Oct 22 , 2024 | 05:20 PM
వక్ఫ్ (సవరణ) బిల్లు-2024పై బీజేపీ నేత జగదాంబిక పాల్ అధ్యక్షతన పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్‌లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఒడిశా-కటక్‌కు చెందిన జస్టిస్ ఇన్ రియాలిటీ, పంచశాఖ ప్రచార్ ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించేందుకు కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది.
న్యూఢిల్లీ: వక్స్ బిల్లు (Waqf Bill)పై మంగళవారంనాడు జరిగిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) అనుచిత ప్రవర్తనకు పాల్పడటంతో కమిటీ నుంచి ఒక రోజు పాటు ఆయనను సస్పెండ్ చేశారు.
Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. జలదిగ్బంధంలో ఐటీ సీటీ
వక్ఫ్ (సవరణ) బిల్లు-2024పై బీజేపీ నేత జగదాంబిక పాల్ అధ్యక్షతన పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్‌లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఒడిశా-కటక్‌కు చెందిన జస్టిస్ ఇన్ రియాలిటీ, పంచశాఖ ప్రచార్ ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించేందుకు కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, లాయర్లు తమ అభిప్రాయాలు చెబుతుండగా, బిల్లుకు సంబంధించి మీరు ఏం చెప్పదలచుకున్నారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సహా పలువురు విపక్ష నేతలు నిలదీశారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన అభిజిత్ గంగోపాధ్యాయ్‌తో వాగ్వాదం చోటుచేసుకోవడంతో బెనర్జీ కోపంతో అక్కడున్న గ్లాస్ వాటర్ బాటిల్‌ను పగులగొట్టి విసిరేశారు. దీంతో ఆయన బొటనవేలు, చూపుడువేలుకు గాయమైంది. ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వక్ఫ్ బిల్లు-2024
కేంద్ర మైనారిటీల వ్యవహారాల శాఖ మత్రి కిరణ్ రిజిజు ఆగస్టు 8న లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు-2024ను విపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య ప్రవేశపెట్టారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని టీడీపీ ఎంపీ గంటి హరీష్ మాధుర్ చెప్పారు. భాగస్వామ్య పక్షాలు, విపక్ష పార్టీల డిమాండ్‌కు అనుగుణంగా సమగ్ర చర్చకు గాను బిల్లును జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉభయసభల్లోని 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. ఇందులో వివిధ పార్టీలకు చెందిన 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..
Bomb Threats: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..
Read More National News and Latest Telugu News