Share News

Vinod Kambli: క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:51 PM

కాంబ్లి తీవ్ర అనారోగ్యం పాలుకావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఆయనకు ఆర్థిక సాయం చేసేందుకు 1983 వరల్డ్ కప్ స్క్వాడ్ మెంబర్లు ముందుకు వచ్చారు. సాయం అందుకునేందుకు కాంబ్లీ సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు.

Vinod Kambli: క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం

న్యూఢిల్లీ: అనారోగ్య పరిస్థితితో కొద్ది వారాలుగా ఇబ్బంది పడుతూ గతం శనివారం రాత్రి థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అవసరమైన వైద్యపరీక్షలు చేసినప్పటికీ ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. 52 ఏళ్ల కాంబ్లి ఇటీవల మరోసారి వార్తల్లోకి వచ్చారు. తన చిన్ననాటి మిత్రుడు, లెజెండ్రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఇటీవల రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్‌లో కాంబ్లి కలుసుకున్నారు. ఈ ఈవెంట్‌లో ఆయన వీల్‌చైర్‌లో కూర్చుని కనిపించినప్పటి నుంచి క్రికెట్ అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు.

Karti Chidambaram: వారానికి 4 రోజుల పని చాలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తితో విభేదించిన ఎంపీ


కాంబ్లి తీవ్ర అనారోగ్యం పాలుకావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఆయనకు ఆర్థిక సాయం చేసేందుకు 1983 వరల్డ్ కప్ స్క్వాడ్ మెంబర్లు ముందుకు వచ్చారు. సాయం అందుకునేందుకు కాంబ్లీ సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు. రిహాబిలేషన్‌ సెంటర్‌కు వెళ్లేందుకు తాను సిద్ధమేనని, అక్కడికి వెళ్లేందుకు తనకెలాంటి భయం లేదని, తన కుటుంబం కూడా తనతోనే ఉందని ఇటీవల వెల్లడించారు.


జడేజా తనకు మంచి మిత్రుడని, ఇటీవల తనకు చూడడానికి కూడా వచ్చాడని, 'కమాన్ గెటప్' అంటూ తనను ఉత్సాహపరిచాడని కాంబ్లి గుర్తుచేసుకున్నారు. ఆలస్యంగానైనా చాలా మంది ఇప్పుడు తనను చూడడానికి వస్తున్నారని చెప్పారు. బీసీసీఐ కూడా తనకు హెల్త్ చేస్తుందని అనుకుంటున్నానని, అబెయ్ కురువిల్ల (మాజీ ఇండియన్ పేసర్) కూడా బీసీసీఐతో ఉన్నారని, తనతోనూ, తన భార్యతోనూ ఆయన ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారని కాంబ్లి తెలిపారు. సచిన్ తనకు ఎప్పుడూ ఏమీ చేయలేదని అనుకునేవాడినని, అయితే తనకు గతంలో రెండు సర్జరీలు జరిగినప్పుడు మెడికల్ బిల్స్ ఆయనే చెల్లించారని, తమ స్నేహం ఎప్పటిలాగే ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుంబ్లే తెలిపారు.


ఇది కూడా చదవండి..

National : యూపీలో భారీ ఎన్‌కౌంటర్.. హతమైన ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు..

National Farmers Day: నేడు జాతీయ రైతు దినోత్సవం.. దీని చరిత్ర గురించి తెలుసా..

For National News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 03:51 PM