Share News

LokSabha Elections: ఈ ఎన్నికల్లో మెజార్టీ రాకుంటే.. అమిత్ షా ఏమన్నారంటే..

ABN , Publish Date - May 17 , 2024 | 02:19 PM

ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టాస్తారని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో 400 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

LokSabha Elections: ఈ ఎన్నికల్లో మెజార్టీ రాకుంటే..  అమిత్ షా ఏమన్నారంటే..
Amith Shah

న్యూఢిల్లీ, మే 17: ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టాస్తారని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో 400 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఓ వేళ ఈ ఎన్నికల్లో బీజేపీ 272 సీట్ల కంటే తక్కవ సీట్లు వస్తే.. బీజేపీ పరిస్థితి ఏమిటీ? మీ వద్ద ఏమైనా ప్లాన్ బీ ఉందా? అంటూ అమిత్ షాను యాంకర్ ప్రశ్నించారు. అందుకు అమిత్ షా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తమ పార్టీకి అలాంటి అవకాశమే లేదన్నారు. నరేంద్ర మోదీ వెనుక 60 కోట్ల బలమైన సైన్యం ఉందన్నారు. వారందరికి కులంతోకానీ వయస్సుతో కానీ సంబంధమే లేదని ఆయన పేర్కొన్నారు.

AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట


నరేంద్ర మోదీని ఎలా గెలిపించాలో వారందరికీ తెలుసునని చెప్పారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. తమ వద్ద ప్లాన్ ఏ.. అంటే ఈ ఎన్నికల్లో 400 స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. ప్లాన్ ఏ ఉండగా... ప్లాన్ బీ ఆలోచనే తమకు లేదని ఈ సందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు. బీజేపీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మద్దతుదారులు ఉన్నారని ఈ సందర్బంగా అమిత్ షా గుర్తు చేశారు.

అలాగే బీజేపీ రాజ్యాంగం మారుస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అమిత్ షా స్పందించారు. గత పదేళ్లుగా తాము అధికారంలో ఉన్నామని.. బలమైన మెజార్టీ సైతం తమకు ఉందని... అయినా రాజ్యాంగాన్ని ఏమైనా మార్చామా? అని యాంకర్‌ను అమిత్ షా ఈ సందర్బంగా సూటిగా ప్రశ్నించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 17 , 2024 | 04:44 PM