ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..!

ABN, Publish Date - Aug 12 , 2024 | 01:01 PM

కాలేయం శరీరంంలో ముఖ్యమైన అవయవం. ఇది పిత్తరసాన్ని తయారు చేయడం ద్వారా ఆహారం జీర్ణం కావడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఆహారం నుండి పోషకాలు గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ మధ్య కాలంలో జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది కాలేయ సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది టిప్స్ పాటించాలి.

ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..! 1/6

సమతుల ఆహారం:- కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు బాగా తీసుకోవాలి. అధిక కొవ్వు ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర ఆహారాలు అవాయిడ్ చెయ్యాలి.

ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..! 2/6

హైడ్రేట్:- రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల కాలేయం టాక్సిన్లను బయటకు పంపి సక్రమంగా పనిచేస్తుంది.

ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..! 3/6

వ్యాయామం:- రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది కాలేయం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.

ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..! 4/6

ఆల్కహాల్:- ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తగ్గించాలి. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య రావడానికి కారణం అవుతుంది.

ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..! 5/6

పెయిన్ కిల్లర్స్:- వైద్యుల సలహా మేరకు, వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మెడిసిన్ లేదా పెయిన్ కిల్లర్లు వాడాలి. మందులు కాలేయాన్ని బలహీనం చేస్తాయి.

ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది..! 6/6

టీకాలు:- పెపటైటిస్ A, B వంటి సమస్యల కోసం ముందుగానే టీకాలు వేయించుకోవాలి. ఇవి కాలేయాన్ని, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.

Updated at - Aug 12 , 2024 | 01:19 PM