Over Thinking Problem : ఆలోచనల వేడితో బుర్ర హీటెక్కిపోతోందా.. ఈ చిట్కాలతో సమస్య దూరం..
ABN, Publish Date - Mar 22 , 2025 | 06:10 PM
Tips to Over Thinking Problem : ఒకచోట స్థిరంగా కూర్చున్నా ఆలోచనలు ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాయా. వాస్తవ జీవితాన్ని ఎంత ఆస్వాదించాలని ప్రయత్నించినా బుర్రలో గింగిర్లు తిరుగుతున్న ఆలోచనల ప్రవాహం మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వట్లేదా.. దిగులు పడకండి.. ఈ చిట్కాలతో ఆ సమస్య ఇట్టే మాయమవుతుంది.

ఆలోచించడం తప్పు కాదు. కానీ, చిన్న విషయం గురించి అదే పనిగా ఆలోచిస్తూ రోజంతా గడిపేయడమే తప్పు. ఇతరులతో పోలిస్తే మీరు అతిగా ఆలోచిస్తున్నారంటే అందుకు కారణం ఈ సమస్యలే.

పనిలో పెరుగుతున్న ఒత్తిడి, అనుసరిస్తున్న జీవినశైలి, కుటుంబ పరిస్థితులు ఇలా అనేక కారణాలు ఆందోళన, ఒత్తిడి సమస్యలను తీవ్రం చేయవచ్చు.

అవసరానికి మించి అతిగా ఆలోచిస్తూ ఉంటే మానసిక, ఆరోగ్య సమస్యలకు చేరువై అనుబంధాలకు, మనశ్శాంతికి దూరంగా ఉండిపోతారు. కాబట్టి, ప్రతికూల ఆలోచనలు వదిలి సానుకూల దృక్పథాన్ని పెంచుకుంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనల భారం తగ్గి ఉత్సాహం పెరుగుతుంది.

ఓవర్ థింకింగ్ సమస్యను అధిగమించడానికి మరో మార్గమూ ఉంది. మీ మెదడులో పుట్టే ఆలోచనలను పేపర్ పై పెట్టండి. అప్పుడు మనసు తేలికవుతుంది. మీరు ఏ సమస్యతో వేధనపడుతున్నారో మీకే అర్థమవుతుంది.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపేందుకు కొంత సమయం కేటాయించుకోండి. వారితో మీ సమస్యలు, ఆలోచనలను పంచుకుంటే సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. పరిస్థితి అదుపు తప్పుతుంటే వైద్యుడిని సంప్రదించండి.
Updated at - Mar 22 , 2025 | 06:19 PM