Drinking Salt Water : చిటికెడు ఉప్పు కలిపిన నీరు తాగితే ఎన్నెన్ని ప్రయోజనాలో..
ABN, Publish Date - Mar 22 , 2025 | 06:14 PM
Drinking Salt Water : ఉప్పు వేయకుండా ఏ ఆహారాన్ని నోట్లో పెట్టుకోలేం. అంతేకాదు. శరీరానికి చాలా అవసరమైన లవణం కూడా. ఒక చిటికెడు ఉప్పు వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.

ఉప్పు, నీరు రెండూ శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యంగా ఉండేలా చేసి డీహైడ్రేషన్ నుంచి కాపాడుతాయి. దీని వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

చిటికెడు ఉప్పు మన బాడీ ఎక్కువ సమయం నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది.

ఉప్పు నీరు జీర్ణవ్యవస్థను క్రమబద్ధం చేస్తాయి. ఎసిడిటీని తగ్గిస్తాయి. చర్మం తాజాగా ఉండేలా చేసి ముఖాన్ని కాంతిమంతం చేస్తాయి.

ఉప్పు కలిపిన నీరు తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఎలక్ట్రోలైట్లను తిరిగి పొందడం వల్ల కండరాల తిమ్మిరి తగ్గుతుంది. ఉప్పులో ఉండే ఖనిజాలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

ఉప్పు నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రణలోకి వస్తుంది. కార్టిసాల్, అడ్రినలిన్ స్థాయిలను తగ్గించి ఒత్తిడిని అదుపులోకి తెస్తుంది.

ఉప్పు నీటికి యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉప్పు పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి, అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం.
Updated at - Mar 22 , 2025 | 06:41 PM