మహబూబ్‌నగర్‌లో ఆంధ్రజ్యోతి బంపర్ డ్రా
ABN, Publish Date - Mar 22 , 2025 | 02:59 PM
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో ఇవాళ(శనివారం) బంపర్ డ్రా జరిగింది. ఈ డ్రాలో మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆంధ్రజ్యోతి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జి తిరుపతయ్య గౌడ్, బ్యూరో ఇన్‌చార్జి రవీందర్ రెడ్డి అడ్వర్టైజ్‌మెంట్ మేనేజర్ చందు, సర్కులేషన్ మేనేజర్ వెంకటరమణ, ఆంధ్రజ్యోతి సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లో ఇవాళ(శనివారం) బంపర్ డ్రా జరిగింది.

ఈ డ్రాలో మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆంధ్రజ్యోతి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎడిషన్ ఇన్‌చార్జి తిరుపతయ్య గౌడ్, బ్యూరో ఇన్‌చార్జి రవీందర్ రెడ్డి అడ్వర్టైజ్‌మెంట్ మేనేజర్ చందు, సర్క్యులేషన్ మేనేజర్ వెంకటరమణ, ఆంధ్రజ్యోతి సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్ అండ్ బైక్ రేస్ బంపర్ డ్రా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

మహబూబ్‌నగర్ అప్పన్నపల్లిలోని తిరుమలహిల్స్‌లో గల ఆంధ్రజ్యోతి ఎడిషన్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది.

డీఎస్పీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా ఎడిషన్ పరిధిలో జరిగిన లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా బైక్, ద్వితీయ బహుమతిగా 185 లీటర్ల రిఫ్రిజిరేటర్, తృతీయ బహుమతిగా 32 ఇంచుల ఎల్‌ఈడీ టీవీ అందజేయనున్నారు.

అదేవిధంగా వంద మందికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నారు.

మహబూబ్‌నగర్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో బంపర్ డ్రాకు సంబంధించిన దృశ్యాలు

ఈ డ్రాలో గెలిచిన ఆంధ్రజ్యోతి పాఠకులకు ఫోన్ చేసి చెప్పారు.
Updated at - Mar 22 , 2025 | 03:03 PM