Heatwave Alert: ఏపీలో దంచికొడుతున్న ఎండలు.. భానుడి భగభగలతో జనం బెంబేలు
ABN, Publish Date - Mar 22 , 2025 | 07:11 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రజలు ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్నారు. క్రయవిక్రయదారులు లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

దంచి కొడుతున్న ఎండలతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో మధ్యాహ్నం వేళ కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.

ఉదయం పది గంటల తర్వాత ఇళ్లలో నుంచి కాలు బయటపెట్టడానికి ప్రజలు భయపడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు వేడిగాలులతో నరకయాతన పడుతున్నారు.

ఇంట్లో ఉన్నా ఉక్కపోతతో ఉక్కిరి..బిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక జిల్లాలో వడదెబ్బ బారిన పడుతున్నారు. ఎండ తీవ్రతకు వృద్ధులు అస్వస్థతకు గురవుతున్నారు.

మార్చి రెండో వారం నుంచే జనం ఎండ నుంచి రక్షణ పొందడానికి గొడుగులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

క్రయవిక్రయదారులు లేక మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఎండల కారణంగా మార్కెట్లకు కొనుగోలుదారులు రావడానికి జంకుతున్నారు. మార్కెట్లకు ప్రజలు రాకపోవంతో వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో నష్టాల పాలవుతున్నామని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
Updated at - Mar 22 , 2025 | 07:15 PM