ఎండల దెబ్బకు అల్లాడి పోతున్న పశుపక్షాదులు..
ABN, Publish Date - Mar 22 , 2025 | 07:53 AM
ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తుతున్నాయి. ముఖ్యంగా మూగ జీవాలు తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ప్రతి ప్రాణి మనుగడకు జలమే ప్రధాన జీవనాధారం

వేసవి రావడంతో బావులు, చెరువుల్లో తాగునీరు లేక మూగజీవులు ఇళ్లలోకి వస్తున్నాయి.

మానవ తప్పిదాల వల్ల గ్లోబలైజేషన్ పెరిగిపోయి ప్రతి ఏటా ఎండలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రతి ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

నీటి ఎద్దడి సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.

పర్యావరణాన్ని రక్షిస్తూ వర్షపు నీటిని ఒడికి పట్టి వృక్ష సంపదను సృష్టిస్తే ప్రకృతిని రక్షించినట్లు అవుతుంది

నీటిని పొదుపుగా వాడుకుంటూ, ఇళ్లల్లో పక్షులకు నీరు అందించే ఏర్పాట్లు చేయాలి.

సమాజానికి స్ఫూర్తిని ఇచ్చినట్టు అవుతుంది ఈ పశువు, పక్షులను చూస్తూనే తెలుస్తుంది

అలాగే కుక్కలు, పిల్లులు,చేపలు,కోతులు వంటి జీవులకు సైతం ఎప్పటికప్పుడు మంచినీరు అందేలా చూడాలి.
Updated at - Mar 22 , 2025 | 08:09 AM