Pawan Kalyan: కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
ABN, Publish Date - Mar 22 , 2025 | 09:35 PM
కర్నూలు జిల్లాలో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో ఫాం పాండ్స్‌కు శంకుస్థాపన చేశారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో పవన్ కల్యాణ్‌కు ప్రజా ప్రతినిధులు, అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

కర్నూలు జిల్లాలో శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు.

జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా పూడిచర్లలో ఫాం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో పవన్ కల్యాణ్‌కు ప్రజా ప్రతినిధులు, అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

ప్రజలందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రపంచ జల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పూడిచర్లలో ఫాం పాండ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు

ఏపీ వ్యాప్తంగా లక్షా 55వేల ఫాం పాండ్స్ నిర్మాణానికి భూమిపూజ చేశామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలబడ్డ ప్రతీ ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని పవన్ కల్యాణ్ అన్నారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో అన్ని వ్యవస్థలను పటిష్ఠం చేస్తున్నామని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు అనుభవంతోనే పల్లె పండుగ విజయవంతమైందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

మనం గ్రామాల్లో నీటిని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమని పవన్ కల్యాణ్ తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని పవన్ కల్యాణ్ విమర్శించారు.

ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించామని పవన్ కల్యాణ్ వివరించారు.

ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కల్యాణ్ తెలిపారు.

వంద మందికిపైగా ఉన్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించామని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరుతో పాటు మౌలిక వసతులు కల్పించామని పవన్ కల్యాణ్ తెలిపారు.

లక్షా 55 వేల పంట కుంటలు నిండితే మనకు నీటి ఇబ్బంది ఉండదని పవన్ కల్యాణ్ అన్నారు.

గౌరు చరితా రెడ్డి ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మిస్తే రాయలసీమలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బైరెడ్డి శబరి వెల్లడించారు.

ఫాం పాండ్స్ కార్యక్రమం చాలా గొప్పదని..రైతులకు ఎంతో మేలు చేస్తుందని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

1.55 లక్షల ఫాం పాండ్స్ నింపితే ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు.

తన ఇంటి పేరు ఉన్న కొణిదేల గ్రామం దత్తతపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వివిధ అభివృద్ధి పనులకు తన ట్రస్టు నుంచి రూ. 50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. సంక్షేమ పథకాల ద్వారా గ్రామాన్ని డెవలప్‌మెంట్ చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

త్వరలోనే ఆలూరు కొణిదేల గ్రామాన్ని సందర్శిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.

పల్లెలు, రోడ్లు, దేశం బాగుండాలనేదే తన ఆలోచన అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. నీరు ఉన్న చోటే నాగరిక కథ..అక్కడే భాష కూడా ముందుకెళ్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Updated at - Mar 22 , 2025 | 09:42 PM