నల్గొండ జిల్లాలో గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు
ABN, Publish Date - Mar 21 , 2025 | 08:54 PM
జలమే కదా జీవన ఆధారం.. భూమిపై నివసించే ప్రతి ప్రాణి మనుగడకు జలమే జీవం. మానవుని తప్పిదాలతో అటు జీవరాశులకు, ప్రకృతికి హాని కలుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు నీటి ఎద్దడి సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణాన్ని రక్షిస్తూ వర్షపు నీటిని ఒడిసిపట్టి వృక్ష సంపదను సృష్టిస్తే ప్రకృతిని రక్షించినట్లే. భావి భారత సమాజానికి స్ఫూర్తినిచ్చినట్లు అవుతుంది. ఈ పశుపక్ష్యాదులను ఈ చిత్రాల్లో చూస్తే నీటి విలువ ఏ పాటిదో తెలుస్తుంది.

వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటడంతో మూగజీవాలు నీరులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

వానాకాలంలో నీటితో కళకళలాడిన జలాశయాలు వేసవిలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి.

ట్యాప్ దగ్గర నీటి కోసం ఇబ్బంది పడుతున్న కాకులు

నీటికోసం ట్యాప్ దగ్గర నిరీక్షిస్తున్న పిచ్చుక

భూగర్భ జలాలు అడుగంటి చుక్క నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.

నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.

నల్గొండలోని ఓ జలశయంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ బాటిళ్లు

నీటికోసం ఇబ్బందులు పడుతున్న మూగజీవాలు

నీటి కోసం ఇబ్బంది పడుతున్న వానరాలు

నీటికోసం తేనెటీగ తండ్లాట
Updated at - Mar 21 , 2025 | 09:34 PM